రోజుకి ఐదు ఆటలకు సై గాంధీజీ హంతకుడు పేరును చివర్న తగిలించుకుని సినీ పరిశ్రమను ఆకర్షించిన బాలీవుడ్ సెక్సీ బాంబ్ ముగ్ధా గాడ్సే. ఇపుడీ భామ ఓ అలవాటుకు బానిసగా మారిపోయిందట. పొద్దస్తమానం వాటితో ఎంజాయ్ చేయలేకుండా ఉండలేకపోతోందట. కనీసం ఐదు ఆటలైనా వేస్తేనే ఓకే అంటోందట. ఇంతకీ ఏమిటా ఆటలు.. ఎందుకంత ఇష్టం అని ఆరా తీస్తే.. ఓ విషయం బయటపడిందట. ముగ్ధా గాడ్సేకు సినిమాల పిచ్చి మరీ ఎక్కువట. అందువల్లనో ఏమోగానీ ఉదయం నుంచి సాయంత్రం దాకా సినిమాలపై సినిమాలను వీక్షిస్తూనే ఉంటుందట. ఈ చిత్రాల్లో హాలీవుడ్‌తో సహా బాలీవుడ్, టాలీవుడ్ సినీ పరిశ్రమలకు చెందిన పలు చిత్రాలున్నాయట. అన్నట్లు రామ్ చరణ్ తేజ మగధీర చిత్రాన్ని అదేపనిగా పదిసార్లూ చూసిందట. ఈ సిన్మా చూసిన దగ్గర్నుంచి తను కూడా మిత్రవింద పాత్రలాంటి అద్భుతమైన పాత్ర దొరికితే నటించడానికి తాను రెడీ అని టాలీవుడ్ సినీపరిశ్రమకు చెపుతోంది. మరి ముగ్ధా గాడ్సేను అలా చూసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారా...? |
Monday, November 22, 2010
రోజుకి ఐదు ఆటలకు సై
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment