హీరోయిన్ వేటలో విశాల్
పలు అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన తమిళ కథానాయకుడు విశాల్ గత కొద్ది రోజులుగా తన తాజా చిత్రానికి హీరోయిన్‌ను ఎంపిక చేసే పనిలో బిజీగా వున్నారు. తెలుగులో గోపీచంద్ హీరోగా రూపొందిన ‘శౌర్యం’ తమిళంలో రీమేక్ అవుతోంది. అందులో నటిస్తున్న తన సరసన ఓ క్రేజీ హీరోయిన్‌ను నటింపజేయాలని, ఆ పనిని తనే స్వయంగా పూనుకొని ఆ వేటలో వున్నాడు విశాల్. ఇందుకోసం త్రిషను సంప్రదించగా డేట్స్ సమస్యతో ఆ ఆఫర్‌ని ఆమె సున్నితంగా తిరస్కరించనట్లుగా తెలిసింది. విశాల్‌తో నటించటానికి త్రిష తిరస్కరించడం ఇది రెండోసారి. సరే, ఇక హన్సిక దగ్గరైనా తన అదృష్టం పరీక్షించుకుందామని వెళ్ళిన ఈ యువ కథానాయకుడికి అక్కడ కూడా కూడా త్రిష చెప్పిన రీజనే ఎదురైందట. ఇక లాభం లేదనుకొని తెలుగు ‘శౌర్యం’లో నటించిన అనుష్కనైనా తన సరసన నటిస్తుందేమోనని కొండంత ఆశతో వెళ్ళిన విశాల్ ప్రయత్నం. ప్చ్... మరోసారి విఫలమైంది. ఆల్రెడీ తెలుగులో చేసిన పాత్రను తమిళంలో తిరిగి చేయడం ఇష్టలేక ఆమె కాదన్నారని సమాచారమ్. దాంతో మళ్లీ వేటలో పడిన విశాల్ జాబితాలో తమన్నా, కాజల్, సమంతా వున్నారట. ఈ ముగ్గురిలో ఒకరైనా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వకపోతారా అని విశాల్ ఆశగా వున్నారట.
No comments:
Post a Comment