జగపతిబాబు చేస్తున్న'చట్టం'
జగపతిబాబు చేస్తున్న'చట్టం'
జగపతిబాబు కథానాయకుడిగా విశాఖ టాకీస్ పతాకంపై నట్టి కుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ సంయుక్తంగా నిర్మిస్తోన్న 'చట్టం.. నీ అబ్బ సొత్తా?' చిత్రం షూటింగ్ రామానాయుడు స్టూడియోస్‌లో మంగళవారం ప్రారంభమైంది. పి.ఎ. అరుణ్‌ప్రసాద్ దర్శకుడు. జగపతిబాబుపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి సీనియర్ నిర్మాత డాక్టర్ డి. రామానాయుడు క్లాప్‌నివ్వగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కెమెరా స్విచ్చాన్ చేశారు. దీనికి నిర్మాత, దర్శకుడు బి.వి. రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ "జయాపజయాలకు ఒకే విధంగా స్పందించే మనస్తత్వం వల్లే నట్టి కుమార్ ఈ స్థాయికి చేరుకున్నాడు. తన గురువైన కోడి రామకృష్ణని మించిన స్థాయికి అరుణ్‌ప్రసాద్ ఈ సినిమాతో ఎదగాలని కోరుకుంటున్నా. చేసిన ప్రతి పాత్రకూ ప్రాణంపోసే జగపతిబాబుకు ఇది మరో మంచి సినిమా అవుతుందని ఆశిస్తున్నా'' అన్నారు.
No comments:
Post a Comment