‘మగధీర’తో పోలిక లేని ‘ఆరెంజ్’
‘‘ప్రేమ మీద ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది. అలాగే నాక్కూడా ఒక అభిప్రాయం ఉంది. ఒక విజన్ ఉంది. అదే ఈ సినిమాలో చూపించాను. ఇది ఎలాంటి సినిమా అనేది ఇప్పుడు అప్రస్తుతం. ఒక్కటి మాత్రం చెప్పగలను.. చరణ్ కెరీర్‌లో ఇది నిలిచిపోయే సినిమా అవుతుంది’’ అన్నారు దర్శకుడు భాస్కర్. ఆయన దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ఆరెంజ్’.కె.నాగబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా భాస్కర్ పై విధంగా స్పందించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ- ‘‘మగధీర’ సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడే ఈ కథ సిద్ధం చేశాను. చరణ్ సింగిల్ సిట్టింగ్‌లో కథను ఓకే చేశారు. ‘ఈ కథలో కరెక్షన్స్ అంటూ ఏమీ లేవు.. నిర్భయంగా ప్రొసీడ్ అయిపోవచ్చు..’ అని ప్రోత్సహించారు నాగబాబు. వీరందరి ప్రోత్సాహం వల్లే ఈ రోజు ‘ఆరెంజ్’ను ఇంతబాగా తీయగలిగాను. నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆధారంగా చేసుకున్న కథ ఇది. ‘మగధీర’కు ఏ మాత్రం పోలికలేని విధంగా, పూర్తి కాంట్రాస్ట్‌తో ఈ సినిమా ఉంటుంది. అమ్మాయిలందరూ తమకు తాము ఐడెంటిఫై చేసుకునే విధంగా ఇందులో జెనీలియా పాత్ర ఉంటుంది. ‘బొమ్మరిల్లు’ ఆమెకు ఎంత పేరు తెచ్చిపెట్టిందో అంతకు మించిన పేరును ఇందులోని పాత్ర జెనీలియాకు తెచ్చిపెడుతుంది. యూత్‌ని ఓ కొత్తలోకంలో తీసుకెళ్లే అందమైన ప్రేమకథ ఇది’’ అని చెప్పారు .
No comments:
Post a Comment