Wednesday, November 17, 2010
డిసెంబర్‌లో 'మిరపకాయ్'
రవితేజ కథానాయకుడిగా; రిచా గంగోపాధ్యాయ్, దీక్ష నాయికలుగా ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై రమేశ్ పుప్పాల నిర్మిస్తోన్న 'మిరపకాయ్' చిత్రం యూరప్‌లో పాటల చిత్రీకరణ జరుపుకుంటోంది. హరీశ్ శంకర్ ఎస్. దర్శకుడు. సినిమా ప్రోగ్రెస్ గురించి నిర్మాత రమేశ్ తెలియజేస్తూ "బ్యాంకాక్‌లో పన్నెండు రోజుల పాటు భారీ ఎత్తున చిత్రీకరించిన క్లైమాక్స్ చాలా గొప్పగా వచ్చింది.ఈ నెల మూడు నుంచి పద్నాలుగు రోజులపాటు యూరప్‌లోని జర్మనీ, ఆస్ట్రియా, చెక్ రిపబ్లిక్, ఫ్రాగ్ దేశాల్లో చిత్రీకరిస్తున్నాం. రవితేజ, రిచాలపై రెండు పాటల్నీ, రవితేజ, దీక్షపై ఓ పాటనీ రాజు సుందరం నృత్య దర్శకత్వంలో తీస్తున్నాం. దీంతో షూటింగ్ మొత్తం అయిపోతుంది. తన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లుగా అందర్నీ వినోదింపజేసే మాస్ రోల్‌ని రవితేజ పోషిస్తున్నారు.డిసెంబర్ చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేయాలని సంకల్పించాం'' అని చెప్పారు. ప్రకాశ్‌రాజ్, కోట శ్రీనివాసరావు, సునీల్, అజయ్, నాగబాబు, చంద్రమోహన్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర, సుప్రీత్, రావు రమేశ్ తారాగణమైన ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: రమేశ్‌రెడ్డి, విక్రమ్ సిరి, పాటలు: సీతారామశాస్త్రి, చంద్రబోస్, భాస్కరభట్ల, రామజోగయ్యశాస్త్రి,, సంగీతం: తమన్ ఎస్., ఛాయాగ్రహణం: రాంప్రసాద్, కూర్పు: గౌతంరాజు, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, కథ, మాటలు, దర్శకత్వం: హరీశ్ శంకర్ ఎస్.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment