పెళ్లాం కొంగుచాటు మొగుడిగా అభిషేక్ బచ్చన్
అభిషేక్ బచ్చన్ ఇటీవలి కాలంలో తెగ ఉడుక్కుంటున్నాడట. ఎందుకూ...? అనంటే... దానికి రకరకాల రీజన్లు చెపుతున్నారు బాలీవుడ్ సినీజనం. ముఖ్యంగా పెళ్లయిన తర్వాత ఐష్ ఫేమ్ తగ్గిపోతుందనుకుంటే అంతకు రెట్టింపు స్థాయిలో దూసుకపోతోంది. ఆమెకు ఆఫర్లపై ఆఫర్లు వచ్చి పడుతూనే ఉన్నాయి. అవకాశాలు వస్తే భర్తగా అభిషేక్ ఆనందించాల్సింది పోయి డీలా పడుతున్నాడట. పైగా ఐష్ వెంట ఎక్కడికి వెళ్లినా అతడిని కరివేపాకులా చూస్తున్నారట. ఇటీవల గుజారిష్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తే అక్కడ అందరూ ఐష్‌ను వీవీవీఐపీగా చూస్తూ ఆమెనే ప్రశ్నలు అడిగారట. ప్రక్కనే ఉన్న అభిషేక్ బచ్చన్‌ను కనీసం ఒక్క ప్రశ్న కూడా వేయకపోవడంతో అభికి కోపమొచ్చి ఫంక్షన్ మధ్యలోనే లేచెళ్లిపోయాడట. మరోవైపు ఐశ్వర్యారాయ్‌కు వరుస ఆఫర్లు వస్తుంటే, అభిషేక్ మాత్రం అవకాశాలు లేక చేతులు ముడుచుకుని ఇంట్లో ఖాళీగా కూచుంటున్నాడట. భార్య ఫేమ్ రోజురోజుకీ పెరుగిపోతుంటే తన ఇమేజ్ మాత్రం రోజురోజుకూ మరుగుజ్జులా మారిపోతుండటాన్ని అభిషేక్ జీర్ణించుకోలేకపోతున్నాడట. దీంతో ఆమెకు కాస్త దూరంగా ఉంటున్నట్లు భోగట్టా.
No comments:
Post a Comment