Tuesday, March 1, 2011

ఎవరి కోసమో పెళ్లి చేసుకోకండి

ఎవరి కోసమో పెళ్లి చేసుకోకండి


బాలీవుడ్ అందాల తార మనీ షా కొయిరాలకు నటిగా మంచి పేరు ఉంది. ఆమె ఉత్తరాదిలోనే కాదు దక్షిణాది ప్రేక్షకుల హృదయాల్లోనూ మంచి స్థానం సంపాదించుకున్నారు. అయితే వ్యక్తిగతంగా ఆమెపై పలు వదంతులు ప్రచారమవుతున్నాయి. ఆమె భర్తతో వివాహ రద్దు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తన సొంత జీవితం గురించి అంటీ అంటనట్లు మాట్లాడే మనీషా వివా హ వ్యవస్థనే దుయ్యపట్టే పనిలో పడ్డారు. వివాహ సంప్రదాయం గురించి అందరూ చాలా ఎక్కువ గా మాట్లాడుతున్నారని, అయితే కొంతమంది జీవితాల్లో అది అంత గొప్పగా లేదని అన్నారు. వయసు మించిపోతుందనే భయంతోనో, ఇతరులు ఏమనుకుంటారో అనే చింతతోనో, చివరి దశలో తోడుకోసమో వివాహం చేసుకోవద్దని, అన్ని విధాలా నచ్చితేనే దానికి సిద్ధపడాలని పెద్ద ఉపోద్ఘాతమే ఇస్తున్నారు. వివాహం చేసుకోకుండా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్న వారిలో తన స్నేహితులు చాలా మంది ఉన్నారన్నారు. ఇక తనపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. తాను భర్త సామ్రాట్‌తో కలిసే జీవిస్తున్నానని వెల్లడించారు.

No comments:

Post a Comment