Friday, March 4, 2011

నా లైఫ్‌లో అతనికి ప్రత్యేక స్థానం

నా లైఫ్‌లో అతనికి ప్రత్యేక స్థానం


నా వయసెంత అనుకున్నారు?... జస్ట్ ఇరవెరైండే. పెళ్లికి ఇంకా చాలా సమయం ఉంది. ఒకవేళ వెండితెరపై నన్ను చూస్తుంటే బోర్ కొడుతోందా ఏంటి?’’ అంటున్నారు ఛార్మి. తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఈ పంజాబీ బ్యూటీ తన మనసు విప్పి కొన్ని విషయాలు చెప్పారు. ఆ మాటల్లో సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ గురించిన ప్రస్తావన వచ్చింది. దేవీతో ఛార్మికి ఎఫైర్ ఉందనే వార్త ఒకానొక సమయంలో భారీ ఎత్తున ప్రచారమైంది. ఆ తర్వాత అది సద్దుమణిగినప్పటికీ ఈ ఇద్దరి మధ్య ‘సమ్‌థింగ్’ ఉందనే సందేహం మాత్రం పలువురిలో అలాగే ఉంది. ఆ ప్రస్తావనలో దేవీతో తనుకున్న అనుబంధం గురించి ఛార్మి చెబుతూ - ‘‘దేవీకి, నాకు మధ్య మంచి అవగాహన ఉంది. మేం ఒకరినొకరం బాగా అర్ధం చేసుకున్నాం. దేవీ చాలా జోవియల్ పర్సన్. నాకు అత్యంత ఆప్త మిత్రుడు. నాక్కావల్సినంత సపోర్ట్ ఇస్తాడు. నా జీవితంలో దేవీకి ప్రత్యేకమైన స్థానం ఉంది’’ అన్నారు. అయితే దేవీలో మీకు మంచి జీవిత భాగస్వామి కనిపిస్తున్నాడా? అనే ప్రశ్నను ఛార్మి ముందుంచినప్పుడు.. ఆమె పై విధంగా స్పందించారు. ఆ విషయమై ఆమె మరింత వివరంగా చెబుతూ - ‘‘పెళ్లనేది పెద్ద బాధ్యత. అంత పెద్ద బాధ్యత గురించి నేనింకా ఆలోచించలేదు. నటిగా నేను సాధించాల్సింది ఇంకా చాలా ఉంది’’ అన్నారు.

No comments:

Post a Comment