Friday, March 11, 2011

నా భర్తకు కోపమెక్కువే!

నా భర్తకు కోపమెక్కువే!


తనది శాంత స్వభావమేగానీ తన భర్తకు కొంచెం కోపమెక్కువేనని, ఇద్దరి మనస్తత్వం ఒకేలా ఉండాలని ఎక్కడా లేదని అంటున్నారు నటి భూమిక. భూమికకు, ఆమె భర్త భరత్‌ఠాగూర్‌కు మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయని, ఇద్దరూ వివాహ రద్దుకు సిద్ధం అవుతున్నారని వార్తలు గుప్పుమంటున్నా యి. వీటిపై భూమిక స్పందించారు. తాను ఒంటరిగా బయట ఊర్లకు గానీ, విదేశాలకు గానీ వెళితే భర్త నుంచి విడిపోయానని అర్థమా అని ప్రశ్నించారు. ఆయనెప్పుడూ తన వెంటనే ఉండటం సాధ్యమా అని, ఇలాంటి నిరాధార వార్తలు ప్రచారం చేయడం భావ్యమా అని ఆవేదన వ్యక్తం చేశారు. భరత్ తన సొత్తును దోచుకున్నట్లు, తనను చిత్ర హింసలకు గురి చేస్తున్నట్లు తాజాగా పుకార్లు షికార్లు చేస్తున్నాయన్నారు. వాస్తవానికి తన కుటుంబం ఆ మధ్య ఒక కారు ప్రమాదానికి గురైందని తెలిపారు. అప్పుడు గాయపడ్డ తన తల్లి ఇంకా కోలుకోలేదన్నారు. ఆమెను చూసుకుంటూ ముంబ యిలో ఉంటున్నానని వెల్లడించారు. భర్త నుంచి వివాహరద్దు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు వదంతులు పుట్టిస్తున్నారన్నారు. భరత్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోందన్నారు. తాను సొంతంగా నిర్మించిన తెలుగు చిత్రం తకిట తకిట పరాజయం పొందడం వల్లే తమ మధ్య సమస్యలు తలెత్తాయని మరికొందరు అభూత కల్పనలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. తమ చిత్రంతో పాటు విడుదలయిన మరో రెండు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయని, వాటి గురించి ఎందుకు మాట్లాడరని భూమిక వాపోయారు.

No comments:

Post a Comment