ఇలియానాకు జూనియర్ ఎన్టీఆర్ చిట్కాలు
బక్కపలచని భామ ఇలియానా గంటలతరబడి జూనియర్ ఎన్టీఆర్‌తో తెగ డిస్కషన్స్ చేస్తోందట. అదేమని అడిగితే... చేసేవన్నీ మీకు చెప్పాలా అంటూ రుసరుసలాడుతోందట. రానాతో కలిసి నటిస్తున్న "నేను - నా రాక్షసి" సినిమాకంటే ఎన్టీఆర్ శక్తి చిత్రం ముందు విడుదలయ్యేటట్లు ఉండటంతో ఇలియానా హైరానా పడుతోందట. ఆ చిత్రంలో తన పాత్ర ఎలా వచ్చిందో తెలుసుకోవడమే కాక, చిత్రంలో ఇంకా గ్లామరస్‌గా కన్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందట. పనిలోపనిగా తనకు మంచి సలహాలివ్వాలని జూనియర్ ఎన్టీఆర్‌ను తరచూ కలిసి అడుగుతోందట. జూనియర్ అమ్మడికి అవసరమైన మెళకువలు చెపుతున్నాడట. మరి శక్తిలో ఇలియానా ఎటువంటి శక్తి చూపెడుతుందో వేచి చూడాలి.
No comments:
Post a Comment