ఎయిర్ హోస్టస్‌పై నోరు పారేసుకున్న కత్రినా కైఫ్
నేనెవరో తెలుసా? నన్ను టచ్ చేస్తావా? నీకెంత ధైర్యం’’ అంటూ ఇటీవల కత్రినా కైఫ్ ఓ ‘విమానవతి’ (ఎయిర్ హోస్టస్‌ై)పె విరుచుకుపడ్డారు. కత్రినా నుంచి అలాంటి మాటలు ఊహించని సదరు ఎయిర్ హోస్టస్ కంగు తిన్నారట. తన తప్పేం లేకపోయినా కత్రినాకు క్షమాపణలు చెప్పి ఆమె తప్పుకున్నారట. విషయంలోకి వస్తే.. ఇటీవల కత్రినా ఓ విమానంలో ప్రయాణం చేశారు. విమానం టేకాఫ్ సమయం దగ్గర పడటంతో సదరు విమానవతి కత్రినా దగ్గరకొచ్చి ‘మేడమ్... సీట్ బెల్ట్ పెట్టుకోండి’ అని వినయంగా చెప్పారట. కానీ కత్రినా ఆ మాటలు విననట్లు నటించారట. దాంతో ఆ విమానవతి తన పనిలో నిమగ్నమయ్యారు. ఇక విమానం టేకాఫ్ అయ్యే సమయం మరింత దగ్గరపడటంతో మరోసారి కత్రినాకు చెబుదామని ఆమె దగ్గరకు వెళ్లారట ఎయిర్ హోస్టస్. కత్రినా నిద్రలోకి జారుకున్న విషయాన్ని గమనించి ఆమెను తట్టి లేపారట. అంతే.. కళ్లు తెరిచిన కత్రినా పై విధంగా తన ఆగ్రహాన్ని వ్యక్తపరిచారట. ఇంత చిన్న విషయానికి ఆమె అలా నోరు పారేసుకోవడంతో ఎయిర్ హోస్టస్ బాధపడిపోయి.. చుట్టుపక్కలవాళ్లు తననే చూస్తుండటంతో అవమానంగా ఫీలై కత్రినాకు సారీ చెప్పి అక్కడ్నుంచి తప్పుకున్నారట. కత్రినా సున్నిత మనస్కురాలని బాలీవుడ్ వర్గాలు అంటాయి. అయితే ఈ మధ్య ఆమె ప్రవర్తనలో మార్పొచ్చిందట. అందుకు నిదర్శనంగా ఈ సంఘటనని చెప్పుకోవచ్చని పరిశీలకులు అంటున్నారు. అయితే కత్రినా మేనేజర్ మాత్రం ‘‘విమానంలో అలాంటి సంఘటన జరగలేదు. అసలు కత్రినా నిద్రేపోలేదు’’ అని అందర్నీ నమ్మించడానికి ట్రై చేస్తున్నారు.
No comments:
Post a Comment