Monday, January 24, 2011

కొలతలు చెప్పడం సంస్కారం కాదు

కొలతలు చెప్పడం సంస్కారం కాదు


36-24-36 అంటూ... కొలతల్ని చెప్పే వారంటే నాకు మంట. ఒకరికి కళ్లు అందంగా ఉంటాయి. ఒకరికి నవ్వు అందంగా ఉంటుంది. ఒకరిలో అమాయకత్వం అందంగా ఉంటుంది. ఆ విధంగా ఆడవారిలో అందాన్ని వెతకాలే తప్ప... కొలతలను చెప్పడం సంస్కారం అనిపించుకోదు’’ అని మండిపడ్డారు అందాల నమిత. విద్యార్థినులపై జరుగుతున్న వేధింపులే అంశంగా ఓ టీవీ చానల్ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న నమిత పై విధంగా స్పందించారు. కార్యక్రమానంతరం నమిత మాట్లాడుతూ-‘‘వేధింపులు అన్ని రంగాల్లోని మహిళలకూ సహజం. సినీరంగంలో నేను కూడా ఎన్నో రకాలు వేధింపులకు లోనయ్యాను. కానీ వాటికి భయపడలేదు. ఓ ఛాలెంజ్‌గా తీసుకున్నాను. అందుకే ఈ స్థాయికి రాగలిగాను. ఈ విషయంలో ముందు మారాల్సింది మీడియా. నా బొద్దుతనం కూడా వారికి ఓ న్యూసే. సన్నగా మల్లెతీగలా ఉండటమే హీరోయిన్‌కి కావాల్సిన అర్హత అనేలా తయారైంది ప్రస్తుత పరిస్థితి. బొద్దుగా ఉండి కూడా హీరోయిన్‌గా సక్సెస్ అవ్వొచ్చు అని చెప్పేందుకే నేను లావయ్యాను. అంతేకాదు... మంచి అవకాశాలను కూడా అందిపుచ్చుకున్నాను. ఎంత లావుగా ఉన్నా నాలోని క్యూట్ లుక్కే నాకు అవకాశాలు తెచ్చిపెడుతున్నాయి. ఏదీ ఏమైనా సమాజాన్ని మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత మీడియాది. వారు పెడదారిలో వెళితే... సమాజం కూడా పెడదారి పడుతుంది. అందుకే స్ర్తీల విషయంలో కాస్త ఆలోచించి ప్రవర్తిస్తే మంచిది’’ అని హితవుపలికారు నమిత.

No comments:

Post a Comment