Friday, January 7, 2011

తాప్సీ నా చెల్లెలు లాంటిది

తాప్సీ నా చెల్లెలు లాంటిది


తెల్లపిల్ల తాప్సీ గురించి మోహన్ బాబు తనయుడు మంచు విష్ణును అభిప్రాయం అడిగితే అవాక్కయ్యే సమాధానం ఇచ్చేశాడు. తాప్సీ తన సొంత చెల్లెలు లాంటిదని చెప్పాడు. విష్ణు చెప్పిన మాటలు విని అక్కడివారంతా ముక్కున వేలేసుకున్నారట. వస్తాడు నా రాజు చిత్రంలో తాప్సీతో వేడి వేడి సన్నివేశాల్లో నటించడమే కాక వేడి ముద్దులు కురిపించిన మంచు విష్ణు, తాప్సీని తన చెల్లెలితో పోల్చడం ఏమిటని వింతగా చూశారట. కానీ వారి మాటలేమీ పట్టించుకోని విష్ణు... తాప్సీ తమ కుటుంబంతో బాగా కలిసిపోయిందనీ, తన మటుకు తాను ఆమెను చెల్లెల్లా ట్రీట్ చేస్తానని చెప్పేశాడు. మరి తమ్ముడు మంచు మనోజ్ ఎటువంటి బంధం ఉందని చెపుతాడో...? 

No comments:

Post a Comment