నేను ఏంజెలీనా కాను
ఫలానా తరహా పాత్రలైతే చేస్తాను.. అనే షరతులు పెట్టడం నాకు ఇష్టం లేదు' అని చెబుతోంది సమంత. 'ఏ మాయ చేసావె' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ 'దూకుడు'గానే ఉంది. ఎన్టీఆర్‌తో 'బృందావనం'లో మెరిసిన ఈ అమ్మడు ఇప్పుడు మహేష్‌తో 'దూకుడు'లో నటిస్తోంది. ఎస్.ఎస్.రాజమౌళి రూపొందిస్తున్న 'ఈగ'తో పాటు.. గౌతమ్ మీనన్ 'ఎర్రగులాబీలు'లో కూడా మెరవబోతోది. సమంత మాట్లాడుతూ ''అన్ని రకాల పాత్రలు పోషించాలని ఉంది. అలాగని మరీ ఏంజెలీనా జోలీ 'టాంబ్ రైడర్'లో పోషించిన పాత్ర అంటే కొంచెం కష్టమే. ఎందుకంటే అందులో యాక్షన్ సన్నివేశాలు మామూలుగా ఉండవు. వావ్‌ఁ అనిపిస్తాయి. నేనేమీ ఏంజెలీనా జోలీని కాను కదా. ప్రయత్న లోపం లేకుండా కష్టపడే మనస్తత్వం నాది. విభిన్నమైన పాత్రల్ని పోషించి మరింత పేరు సంపాదించాలి'' అని మనసులోని కోరికను బయటపెట్టింది.
No comments:
Post a Comment