బికినీకి రెడీ
కన్నడంలో ‘జరసందా’ అనే సినిమాలో నటిస్తున్నారు ప్రణీత. ఆ సినిమాలో ఓ రేంజ్‌లో గ్లామర్‌ను ఒలికిస్తున్నారని బెంగళూరు సమాచారం. ఆధునిక భావాలు కలిగిన అమ్మాయి పాత్రలో చేస్తున్నారట ప్రణీత. కన్నడరంగంలో ఈ సినిమా తనకు గొప్ప పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకంతో ఉన్నారీ బెంగళూరు భామ. మళ్లీ తెలుగుతెరపై దర్శనమెప్పుడు అనడిగితే- ‘‘నాకు తెలుగు సినిమాలంటే ఇష్టం. తెలుగులో నేను చేసిన సినిమాలు రెండు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా... ఆనందాన్నే మిగిల్చాయి. మళ్లీ తెలుగులో చేసే అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను’’ అన్నారు ప్రణీత. ఇంకా ఆమె మాట్లాడుతూ- ‘‘నేను మోడ్రన్ అమ్మాయిని. నా వ్యక్తిత్వానికి, మనసుకు దగ్గరగా ఉండే పాత్రలు లభిస్తే... ఇష్టంగా చేస్తాను. ప్రస్తుతం కన్నడంలో ‘జరసందా’ చిత్రంలో నా మనస్తత్వానికి దగ్గరగా ఉండే పాత్ర చేస్తున్నాను’’ అని చెప్పారు. గ్లామర్‌కి మీరిచ్చే నిర్వచనం ఏమిటి అని అడిగితే -‘‘గ్లామర్ అనేది నా దృష్టిలో మనసుకు సంబంధించింది. పాత్రోచితంగా ఎలా కనిపించాలన్నా నేను అభ్యంతరం పెట్టను. బికినీ వేయడానికి కూడా నేను సిద్ధమే. కథ డిమాండ్ చేస్తే... లిప్ లాక్ సీన్స్‌లో కూడా నటించడానికి అభ్యంతరం చెప్పను’’ అని తెలిపారు ప్రణీత. ఈ ముద్దుగుమ్మ మనోగతం చూస్తుంటే... జయాపజయాలకు అతీతంగా అనతికాలంలోనే అగ్రపథంలోకి చేరుకునే ఛాయలు కనిపిస్తున్నాయి.
No comments:
Post a Comment