Tuesday, January 4, 2011

నేను మొదటిసారి ఏడ్చింది అప్పుడే

నేను మొదటిసారి ఏడ్చింది అప్పుడే


నాకు ఇష్టమైన అంకె ‘ఒకటి’. ఏ రంగంలో ఉన్నా... నంబర్‌వన్‌గా ఉండటానికే ఇష్టపడతా. ఆ స్థానం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తా. ఈ స్థాయికి చేరుకునే క్రమంలో నాకు ఎదురైన పరిస్థితులను తెలియజేయాలంటే... ఓ పుస్తకాన్ని రాయొచ్చు’’ అంటున్నారు విశ్వసుందరి ఐశ్వర్యరాయ్. తన మనోగతాన్ని వ్యక్తపరుస్తూ ఇటీవల ఐష్ పై విధంగా స్పందించారు. ఇంకా ఆమె మాట్లాడుతూ -‘‘మా స్కూల్ పేరు ‘ఆర్య విద్యాభవన్’. టెన్త్ క్లాస్ దాకా అక్కడే చదివాను. నైన్త్ క్లాస్ వరకూ మా స్కూల్లో నేనే ఫస్ట్. అందుకే టీచర్లందరూ నన్నెంతో ప్రేమగా చూసేవారు. అప్పట్నుంచే ‘నంబర్‌వన్’ అంటే నాకిష్టం. కానీ టెన్త్ క్లాస్‌లో మాత్రం నాకు తొలిసారి ఎదురుదెబ్బ తగిలింది. ఎప్పుడూ ఫస్ట్ వచ్చే నేను... టెన్త్‌లో మాత్రం ఏడో స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దాంతో మానసికంగా కృంగిపోయాను. నా లైఫ్‌లో కన్నీరు పెట్టుకున్న తొలి సందర్భమది. తర్వాత ఇంటర్‌లో ‘రెండవ’ స్థానానికి పరిమితమయ్యా. అప్పుడు కూడా చాలా బాధ కలిగింది. తర్వాత మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నా. అందరూ కిరీటం తప్పకుండా నాదే అనుకున్నారు. కానీ అలా జరగలేదు. సుస్మితాసేన్ మిస్ ఇండియాగా ఎంపికయ్యారు. ఇలా వరుసగా తగిలిన దెబ్బలు నాలో కసిని పెంచాయి. అలాగే నంబర్‌వన్ అనే స్థానంపై ఇష్టాన్ని కూడా పెంచాయి. అదే కసితో మిస్‌వరల్డ్‌లో పోటీల్లో పాల్గొన్నాను. అందరినీ అధిగమించి, నంబర్‌వన్‌గా నిలబడగలిగాను. ఇప్పుడు కూడా బాలీవుడ్‌లో నంబర్‌వన్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ అని ఎవరయినా అంటే... నాకు చెప్పలేనంత ఆనందం కలుగుతుంది’’ అని చెప్పుకొచ్చారు ఐశ్వర్య.

No comments:

Post a Comment