గోపీతో రొమాంటిక్ ఫీల్... ఓహ్: "టాలీవుడ్ కత్రినా"
నిన్నగాక మొన్నొచ్చిన పొడుగు పిల్ల దీక్షాసేథ్ అనుష్క, ఇలియానా వంటివారిని దాటుకుంటూ యమస్పీడుతో ఆఫర్లు దక్కించుకుంటూ వెళ్లిపోతోంది. అంతేకాదండోయ్... తన సెక్సీ ఫిగర్‌ను కావలసినంత గ్లామర్‌గా చూపిస్తూ టాలీవుడ్ కత్రినా అనే ఇమేజ్ ను తెచ్చేసుకుంది. తాజాగా ఆమె గోపీచంద్ సరసన వాంటెడ్ చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో గోపీతో నటించిన అనుభవాన్ని చెపుతూ... షూటింగ్‌లో అన్ని విషయాలు చాలా చక్కగా నేర్పాడని గోపీచంద్‌కు కితాబిస్తోంది. సోలో హీరోయిన్‌గా ఆయన పక్కన నటించడం చాలా థ్రిల్‌గా ఉందనీ, ఇటువంటి అవకాశం తక్కువ కావలంలోనే రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పింది.గోపీచంద్‌తో నటిస్తుంటే రొమాంటిక్ ఫీలింగ్ కల్గిందని డైరెక్టుగా చెప్పింది. వెంటనే.. నాలుక్కరుచుకుని... సన్నివేశంలో రొమాంటిక్‌గా ఫీలవ్వాలి గనుక తను చెప్పినట్లే ఫీలై నటించాననీ అంది. అనుష్కలో కూడా గోపీ అలాంటి ఫీలింగ్ కల్గించి గతంలో నటింపజేశాడన్న సంగతి దీక్షకు తెలుసో లేదో మరి.
No comments:
Post a Comment