అలా ఇమిటేట్ చేస్తే చంపేస్తా
నా వాకింగ్ స్టైల్‌ని ఇమిటేట్ చేస్తే చంపేస్తా...’’ అంటున్నారు త్రిష. ఇంత ఘాటుగా త్రిష వార్నింగ్ ఇచ్చింది ఎవరికోకాదు. జెస్సీగా కురక్రారు హృదయాల్లో అనతికాలంలోనే స్థానం సంపాదించిన అందాల సమంతకు. ఇది సీరియస్‌గా ఇచ్చిన వార్నింగ్ కాదులెండి! అభిమానం, వాత్సల్యం కలగలుపు చేసుకొని ముద్దు ముద్దు మాటలతో ఇచ్చిన మందలింపు మాత్రమే. త్రిష, సమంత మధ్య తొలినుంచి మంచి అనుబంధం ఉంది. హీరోయిన్ కాకముందు నుంచి సమంత... త్రిష అభిమాని. అనుకోకుండా తమిళ్‌లో త్రిష చేసిన ‘జెస్సీ’ పాత్రతోనే సమంత తెలుగులో స్టార్‌డమ్ సాధించారు. సమంత తన అభిమాని అని తెలిసినప్పట్నుంచీ త్రిష కూడా సమంత విషయంలో ఇష్టం కనబరుస్తూ వచ్చారు. ఇటీవల సమంత గురించి త్రిష మాట్లాడుతూ- ‘‘తను మంచి నటి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆమె నటన చూస్తుంటే...నన్ను నేనే చూసుకుంటున్నట్టుంటుంది. ముఖ్యంగా తన న డక. నా వాకింగ్ స్టైల్‌ని బాగా ఇమిటేట్ చేస్తుంది తను. ‘నా వాకింగ్ స్టైల్‌ని ఇమిటేట్ చేస్తే చంపేస్తా’ అని ఓ సారి నవ్వుతూ చెప్పాను. ఏదిఏమైనా... కొత్తగా వచ్చిన హీరోయిన్‌లలో సమంత అంటే నాకు ఇష్టం. తాను నా అభిమాని అన్న విషయం పక్కన పెడితే... ‘ఏ మాయ చేసావె’ చూశాక నేను ఆమె అభిమానిని అయిపోయాను’’ అంటూ సమంతను పొగడ్తలతో ముంచెత్తారు త్రిష.
No comments:
Post a Comment