Monday, January 31, 2011

ఆ వదంతులు బాధ పెట్టాయి

ఆ వదంతులు బాధ పెట్టాయి


అందాల సుందరి ఐశ్వర్య రాయ్‌పై ఇటీవలి కాలంలో ఆరోపణలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా ఈ మధ్య సింగపూర్‌లో జరిగిన ఓ అవార్డ్ వేడుకలో ఐష్ ప్రవర్తనకు నిర్వాహకులు అవాక్కయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వేడుకలో ఐశ్వర్య నృత్య ప్రదర్శన ఇచ్చారు. దీనికోసం రిహార్సల్స్ జరిగినప్పుడు ఆమె చెప్పిన సమయానికి రాకుండా తనకు నచ్చిన టైమ్‌కు వచ్చేవారట. ఇది ఇతర తారలను ఇబ్బందులకు గురి చేసిందని బాలీవుడ్‌లో ఓ వార్త ప్రచారం అవుతోంది. అందాల సుందరి.. క్రేజీ హీరోయిన్.. బచ్చన్ ఇంటి కోడలు..కావడంవల్లే ఐష్ ఇలా ప్రవర్తిస్తున్నారని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. ఈ విమర్శలు ఐశ్వర్య వరకు వెళ్లాయట. మౌనం వహిస్తే.. ఈ మాటలు నిజమవుతాయని భావించిన ఆమె మాట్లాడుతూ - ‘‘యాక్చువల్‌గా నేను వైరల్ ఫీవర్‌తో అవార్డ్ ఫంక్షన్‌లో పాల్గొనలేని స్థితిలో ఉన్నప్పటికీ నిర్వాహకులను నిరుత్సాహపరచడం ఇష్టంలేక సింగపూర్ వెళ్లాను. ఈ అవార్డ్ ఫంక్షన్ జరిగే వారం రోజుల ముందు నుంచే నాకు ఆరోగ్యం బాగాలేదు. ఈ కారణంగా రిహార్సల్స్‌కు సరిగ్గా వెళ్లలేకపోయేదాన్ని. నాకు ఉపశమనంగా అనిపించిన సమయంలో వెళ్లేదాన్ని. ఆ సమయానికి ఇతర తారల ప్రాక్టీస్ ముగిసేది. దాంతో ఎవరూ ఇబ్బందిపడలేదు. కానీ ఈ విషయాన్ని చిలవలు పలవలు చేశారు. అసలు విషయం తెలియక చాలామంది నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను డాన్స్ ప్రాక్టీస్‌కు ఆలస్యంగా వెళ్లిన రోజున అసిస్టెంట్ డాన్సర్లను వెళ్లమనేదాన్ని. కొరియోగ్రాఫర్ నుంచి స్టెప్స్ అడిగి తెలుసుకుని మరీ చేసేదాన్ని. చివరికి అవార్డ్ ఫంక్షన్ రోజున నిర్వాహకులు రెడ్ కార్పెట్‌పై ర్యాంప్ వాక్ చేయమని కోరితే ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ చేశాను. అయినా నా గురించి లేనిపోని వదంతులు సృష్టించడం బాధగా ఉంది’’ అన్నారు ఐశ్వర్యరాయ్. ఇదిలా ఉంటే అవార్డ్ ఫంక్షన్ నిర్వాహకులు కూడా ఐష్ తమని ఇబ్బందులపాలు చేయలేదని, ఆరోగ్యం బాగాలేకపోయినా ఆమె సహకరించారని, ఆమె పక్కా ప్రొఫెషనల్ అని కితాబులిచ్చేస్తున్నారు. ఐష్ అంటే పడనివాళ్లే ఇలా కట్టుకథలు అల్లి ప్రచారం చేస్తున్నారని ఆమె శ్రేయోభిలాషులు అంటున్నారు.

No comments:

Post a Comment