Thursday, January 13, 2011

అంజలిపై చెయ్యేసిన పోకిరోళ్లు

అంజలిపై చెయ్యేసిన పోకిరోళ్లు


వర్ధమాన నటి, అంగాడి తెరు ఫేమ్ అంజలిని పోకిరి కుర్రాళ్లు చేయి పట్టి లాగారట. అక్కడే ఉన్న దర్శకుడు గౌరవ్ వారిని చితకబాదారట. యువ నిర్మాత దయానిధి అళగిరి, వివేక్ రత్నవేల్ సంయుక్తంగా నైన్ క్లౌడ్ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం తూంగానగరం. విమల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి హీరోయిన్గా చేస్తున్నారు. హీరో స్నేహితుడిగా దర్శకుడు గౌరవ్ నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ కొన్ని రోజులుగా మదురైలో జరుగుతోంది.
మదురై బస్టాండ్ వద్ద విమల్, అంజలి, 500 మంది సహాయ నటీనటులలో కీలక సన్నివేశాన్ని ఇటీవల చిత్రీకరించారు. షూటింగ్ చూడడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జనం అక్కడికి చేరుకున్నారు. అందు లో కొందరు పోకిరి కుర్రాళ్లు అంజలి చేయి పట్టి లాగి అల్లరి చేశారు. దర్శకుడు గౌరవ్ వారి చెంప చెళ్లుమనిపించి అక్కడి నుంచి తరిమేశారు. దెబ్బలు తిన్న కుర్రాళ్లు తాము లోకల్ అని, ఇంతకింత అనుభవిస్తావని గౌరవ్ను హెచ్చరించారట. దర్శకుడు కల్పించుకుని తానూ మదురై వాడినేనని సమాధానమిచ్చారట. పోలీసులకు సమాచారం అందించడం తో వారు అక్కడ భద్రత ఏర్పాటు చేశారట.

No comments:

Post a Comment