గోవాలో నిశ్చితార్థం!
పస్తుతం బాలీవుడ్ వార్తల్లో నిలుస్తున్న జంటల్లో షాహిద్ కపూర్, ప్రియాంక చోప్రా జంట ఒకటి. ఈ ప్రేమికులు కొత్త సంవత్సరాన్ని గోవాలో జరుపుకున్నారట. నూతన సంవత్సరం తొలి రోజుని ఎప్పటికీ గుర్తుంచుకునేలా గడపాలనుకున్న ఈ జంట ‘ఉంగరాలు’ మార్చుకున్నారని వినికిడి. ఈ ఉంగరాల మార్పిడి వ్యవహారాన్ని ఈ జంట రహస్యంగా ఉంచాలనుకున్నారు. కానీ గోవా తీరం దాటి ముంబయ్‌కి చేరిపోయింది. ఇంకేముంది? ఇది కచ్చితంగా వివాహ నిశ్చితార్థమే అని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ విషయాన్ని షాహిద్, ప్రియాంకలు ఖండించడంలేదు. దాంతో మౌనం అర్ధాంగీకారం అని చెప్పుకుంటున్నారు.
No comments:
Post a Comment