Friday, January 28, 2011

ఆ హీరోతో కూడా చేస్తే ఓ పనైపోతుంది

ఆ హీరోతో కూడా చేస్తే ఓ పనైపోతుంది


తెలుగుతో పాటు కన్నడంలో కూడా అగ్రతారల్లో ఒకరుగా భాసిల్లుతున్నారు ప్రియమణి. ఈమె ప్రస్తుతం కన్నడంలో మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీగా వున్నారు. కాగా, ఇటీవల అక్కినేని నాగార్జునతో ‘రగడ’ చిత్రంలో రొమాన్స్ చేసిన ఈ తార ఆ చిత్రంలోని ‘అష్టలక్ష్మీ’ పాత్ర తనకెంతో పేరు తెచ్చిపెట్టిందనే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఇదే విషయం గురించి ఆమె మాట్లాడుతూ ‘‘ నాగ్‌తో ఫుల్‌లెంగ్త్ హీరోయిన్‌గా నటించాలన్న నా కోరిక ‘రగడ’ తో తీరింది. ఆయనతో నటించడం ఎంతో కంపర్టబుల్‌గా వుంటుంది. మళ్ళీ నాగ్‌తో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. ఒకవైపు నాగార్జునతో ‘రగడ’ చేస్తూనే మరో వైపు ఆయన మేనల్లుడు సుమంత్‌తో ‘రాజ్’ చిత్రంలో నటిస్తుంటే ఎంతో థ్రిల్లింగ్ అనిపించేది. ఒకేసారి అక్కినేని కుటుంబానికి చెందిన ఇద్దరు హీరోలతో నటించాను. ఇక బ్యాలెన్స్‌గా వున్న నాగచైతన్యతో కూడా నటిస్తే ఓ పనైపోతుంది’’ అంటూ ముసి ముసిగా నవ్వుతూ తన మనసులోని మాటను వ్యక్తపరిచారు. ప్రియమణి. మీరు ఈ మధ్య కాలంలో ప్రతి సినిమాలోనూ మరో హీరోయిన్‌తో కలిసి నటిస్తున్నారు, అప్పుడు మీ మధ్య కాంపిటీషన్ ఎలా వుంటుందన్న ప్రశ్నకు ఆమె సమధానం చెబుతూ ‘‘ ప్రతి హీరోయిన్‌తోనూ నాకు మంచి సంబంధమే వుంది. ఇక వృత్తి ధర్మ ప్రకారం పోటీ అనేది కామనే. అయితే ఈ కాంపిటిషన్ అనేది హెల్తీ వేలో వుంటుంది’’ అని చెప్పారు ప్రియమణి.
 

No comments:

Post a Comment