అలా అన్పించకపోతే నేను ఫెయిల్ అయినట్లే
నన్నెవరైనా సెక్సీ అన్నారో... నాకు ఒళ్లు మండుకొస్తుంది’’ అని జెనీలియా గతంలో స్టేట్‌మెంట్ ఇచ్చిన సంగతి విదితమే. ఇప్పుడా స్టేట్‌మెంట్‌ను ఆమె వాపస్ తీసుకుంటున్నారట. దానికి కారణం బాలీవుడ్‌లో ఆమె చేస్తున్న ఓ చిత్రం. ఆ సినిమా ఏమిటి? అనుకుంటున్నారా!. తెలుగులో వెంకటేష్ కథానాయకుడిగా రూపొందిన ‘ఘర్షణ’ బాలీవుడ్‌లో రీమేక్ అవుతోంది. తెలుగులో అసిన్ చేసిన పాత్రను బాలీవుడ్‌లో జెన్నీ చేస్తున్నారు. ఆ సినిమా కారణంగా ఆమె తన స్టేట్‌మెంట్‌ను వెంటనే వాపస్ తీసుకున్నారు. వెనక్కు తగ్గడం అంటే.. అందాల ఆరబోతకు సిద్ధం అయినట్టేగా అని జెన్నీని అడిగితే- ‘‘పాత్ర స్వభావాన్ని బట్టి నడుచుకోవడమే నటన. కొన్ని పాత్రలు చేసేటప్పుడు కాస్తంత స్పైసీగా కనిపించాల్సి వస్తుంది. ఆ సమయంలో చూసే వారికి సెక్సీగా అనిపించకపోతే నటిగా నేను ఫెయిల్ అయినట్టే. ఇక్కడ చిన్న సవరణ ఏంటంటే... నేను పర్టిక్యులర్‌గా ఒక సినిమా కారణంగా అభిప్రాయాన్ని మార్చుకోలేదు. ఒక నటిగా నాకు నేను రియలైజ్ అయి ఇలా చెబుతున్నా’’ అని చెప్పారు జెన్నీ. అంటే ప్రస్తుతం చేస్తున్న జాన్ అబ్రహం సినిమాలో కూడా సెక్సీగా కనిపించబోతున్నారా? అనంటే- ‘‘అది డిగ్నిఫైడ్‌గా ఉండే పాత్ర. తొలిసారి లెక్చరర్‌గా కనిపిస్తున్నాను. ఎప్పుడైతే ఈ సినిమా చేయడానికి అంగీకారం తెలిపానో... అప్పట్నుంచే నా ప్రవర్తనలోనూ, బాడీ లాంగ్వేజ్‌లోనూ మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నం మొదలుపెట్టాను. ఇప్పటి వరకూ అల్లరి చిల్లరి పాత్రల్లో చేసిన జెనీలియా ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తారు.. సహజంగా జాన్ అబ్రహం సినిమాల్లో రొమాన్స్ పాళ్లు కాస్తంత అధికంగా ఉండే మాట వాస్తవమే. ఈ సినిమాలో కూడా రొమాన్స్ ఉంటుంది. కథరీత్యా కొన్ని రొమాంటిక్ సన్నివేశాల్లో నటించాల్సి వచ్చింది. దాంతో తప్పలేదు. కాకపోతే... అది లిమిట్‌గా ఉంటుంది. ఒక పోలీస్ అధికారి, ఒక అధ్యాపకురాలి మధ్య రొమాన్స్ ఎంతవరకు ఉంటే బావుంటుందో... అంతవరకే ఉంటుంది’’ అని బదులిచ్చారు జెనీలియా.
No comments:
Post a Comment