Sunday, January 9, 2011

మాల్యా ముందే సిద్ధార్థ్‌‌కు "కిస్" ఇచ్చిన దీపికా పదుకొనే!

మాల్యా ముందే సిద్ధార్థ్‌‌కు "కిస్" ఇచ్చిన దీపికా పదుకొనే! 


ప్రముఖ పారిశ్రామిక వేత్త విజయ్ మాల్య కుమారుడు సిద్ధార్థ్.. రొమాన్స్‌లో తన తండ్రిని మించిపోయాడు. అంతే కాదు.. అందమైన అమ్మాయిలను ఎలా బుట్టలో వేసుకోవాలో కూడా సీనియర్ మాల్యాకు ఈ జూనియర్ మాల్యా పాఠాలు నేర్పే అవకాశం ఉంది.బాలీవుడ్ సెక్సీ స్టార్ దీపికా పదుకునేతో ప్రేమాయణం సాగిస్తున్న సిద్ధార్థ్.. ఆమె అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. అయితే.. దీపికా కూడా సిద్ధార్థ ఊహించని గిఫ్ట్ ఇచ్చిందనుకోండి. 16 కోట్ల విలువ చేసే ఓ హైటెక్ అపార్ట్‌మెంట్‌ను దీపికాకు సిద్ధార్థ బహుమతిగా ఇచ్చాడట.సిద్ధార్థ్ ఇచ్చిన పాష్ గిఫ్ట్‌కు దీపికా కూడా ఓ స్వీట్ గిఫ్ట్ ఇచ్చింది. జనవరి 5న దీపికా పుట్టినరోజు కావడంతో ఆమెను సిద్ధార్థ్ జనవరి ఒకటోతేదీన డెన్మార్క్‌లోని కోపెన్హగెన్‌కు తీసుకువెళ్లాడు. దీంతో దీపికా షాక్ గురై ఆశ్చర్యం.. ఆనందాలలో మునిగిపోయింది. ఎందుకంటే అది తాను పుట్టిన ప్రదేశమట. దీంతో ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చిన జూనియర్ మాల్యాకు సీనియర్ మాల్యా చూస్తుండగానే... "ఉమ్మా" ఇచ్చేసిందిట. 

No comments:

Post a Comment