ఏంటీ కమిలినీ... అలా నగ్నంగా కనిపించావ్..?
ఆనంద్ చిత్రంలో పక్కా సాంప్రదాయ కుటుంబానికి చెందిన యువతిగా నటించి అటు పెద్దల్ని, ఇటు యువతను ఆకట్టుకున్న కమలినీ ముఖర్జీకి ఆ తర్వాత అనుకున్న ఆఫర్లు రాలేదు. తాజాగా నాగవల్లిలో నాట్యకారిణిగా చేసింది. డాన్స్ బాగానే వేసిందని ప్రేక్షకులు కితాబిచ్చారు. టాలీవుడ్ లో ఇలా ఉంటే మొన్నీమధ్య ఓ మలయాళ సినిమాలో నటించింది. అందులో నగ్నంగా కన్పించే సన్నివేశంలో చేసిందని భోగట్టా. ఇలా నగ్నంగా నటించడంపై ఆమె అభిమానులు ఆమెకు లెటర్స్ రాశారట. దీనికి ఆమె స్పందిస్తూ.. ఒకనాడు నేను ఫలానా డ్రెస్ వేస్తే బాగుందన్నారు. మీరే ఇలా అంటే ఎలా? మలయాళంలో ఆ సన్నివేశం ఎలా వచ్చిందో... ఏమిటో తెలుసుకోవాలికదా... బాడీ నాదే... కానీ... దాన్ని మార్ఫింగ్‌తో మాయ చేశారని తెలివిగా చెప్పింది. నేను చేయలేదని మాత్రం అనలేదు. దీన్నిబట్టి మనం ఏమనుకోవాలి...?
No comments:
Post a Comment