Friday, January 14, 2011

ఈజిప్టులో పెళ్లి

ఈజిప్టులో పెళ్లి


జిప్టుకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న బాలీవుడ్‌ శృంగార నాయిక సెలీనా జైట్లీ తన పెళ్లిని కూడా అక్కడే చేసుకోవాలని అనుకుంటోంది. ఈ విషయాన్ని ఆమే వెల్లడించింది. ఇటీవల దుబాయ్‌కి చెందిన పీటర్‌ హాగ్‌తో నిశ్చితార్థం చేసుకొన్న సెలీనా పెళ్లికి ఇంకా చాలా సమయం ఉందని సెలవిస్తోంది. మరో ఏడాది వేచి చూడాలని ఆమె నిర్ణయించుకొంది. సెలీనా మాట్లాడుతూ ''పీటర్‌, నేనూ ఉంగరాలు మార్చుకొన్నాం.. దాన్ని మా సంప్రదాయంలో నిశ్చితార్థం అనరు. దుర్గా పూజ సందర్భంగా తల్లిదండ్రుల సమక్షంలో.. వారి ఆశీస్సులతో ఉంగరాల్ని మార్చుకొన్నాం. నా సోదరుడు విక్రాంత్‌ పెళ్లి ముందు జరగాలి. మార్చి లేదా ఏప్రిల్‌లో అతని వివాహం అవుతుంది. బహుశా ఈ ఏడాది ఆఖరున మా పెళ్లి ఈజిప్టులో ఉండొచ్చు. పీటర్‌ హాగ్‌ తొమ్మిదేళ్లుగా దుబాయ్‌లో హోటల్‌ వ్యాపారం చేస్తున్నారు. మన మీడియా వేగానికి ఇంకా ఆయన అలవాటు పడలేదు. ప్రస్తుతం నా చేతిలో సినిమాలు, వాణిజ్య ప్రకటనలు ఉన్నాయి. అవి కూడా పూర్తి చేయడానికి తగినంత సమయం పడుతుంద''ని వివరించింది.

No comments:

Post a Comment