Friday, January 21, 2011

అంత వ్యామోహం లేదు

అంత వ్యామోహం లేదు


గువల్ని కట్టిపడేసే మంత్రం... షాపింగ్‌. కాటుక కోసమని వెళ్లి- క్రెడిట్‌ కార్డు మొత్తం ఖాళీ చేస్తారు. గంటల తరబడి షాపింగ్‌ మాల్స్‌లోనే గడుపుతుంటారు. కానీ నేను అలా కాదు... అంటోంది శ్రియ. 'విదేశాల్లో షూటింగ్‌ అంటే సరదాగా ఉంటుంది. కొత్త ప్రదేశాల్ని చుట్టిరావచ్చు. అక్కడ షాపింగ్‌ కూడా చేస్తా. అయితే ఏం కావాలో అవే కొంటాను. పనికిరాని వస్తువులతో బ్యాగు నింపుకోను. షాపింగ్‌పై అంత వ్యామోహం లేదు' అంటోంది ఈ ఢిల్లీ బొమ్మ. అంతే కాదు.. 'డబ్బుని వృథాగా ఖర్చు చేయకూడదు. మీ దగ్గర మరీ ఎక్కువగా ఉంటే లేనివాళ్లకు సహాయం చేయండి' అని చెబుతోంది. మరి మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఏంటి? అని అడిగితే 'నేను ఢిల్లీలో చదువుకొంటున్నప్పుడు మా కాలేజీ ఎదురుగా ఓ అంధుల పాఠశాల ఉండేది. తీరిగ్గా ఉన్నప్పుడు అక్కడికి వెళ్లేదాన్ని. చూపు లేకపోయినా వాళ్లెలా నడుస్తారు? ఎలా ఆడుకొంటారు? ఇలాంటి విషయాలన్నీ జాగ్రత్తగా గమనించేదాన్ని. వాళ్లకోసం ఏమైనా చేయాలి అని అప్పుడే అనుకొన్నా. వారి కోసం శ్రీ స్పా ప్రారంభిస్తున్నాను'' అని చెప్పింది.

No comments:

Post a Comment