Wednesday, January 5, 2011

టెక్కులు తెలియవు!

టెక్కులు తెలియవు!


నాయికలు తెరపైనే అందంగా కనిపిస్తారు. బయట అంత బాగుండరట. మేకప్‌ లేకుంటే వాళ్లూ మనలాగే ఉంటారు. సినిమా తారలు జనంలోకి వచ్చినప్పుడు టెక్కు చూపిస్తారట - మన కథానాయికల గురించి జనసామాన్యం ఇలాగే మాట్లాడుకొంటూ ఉంటారు. ''అందరి విషయంలోనూ ఆ మాటలు నిజం కాకపోవచ్చు. నా వరకూ నేను చాలా సాదాసీదాగా ఉంటాను'' అంటోంది జెనీలియా. ''కెమెరా ముందు ఉన్నంతసేపే నటిని అనే భావన ఎప్పుడూ నాలో ఉంటుంది. నేనేదో పెద్ద స్టార్‌నని టెక్కుగా ఉండటం, లేనీపోని అహంభావాన్ని ప్రదర్శించడం నాకు చేతకావు. చాలా చిత్రాల్లో నావి అల్లరిపిల్ల పాత్రలే. నిజ జీవితంలోనూ నేను అందరితోనూ కలుపుగోలుగా ఉంటూ, సరదాగా ఉండేందుకు ప్రయత్నిస్తాను. ఈ పద్ధతి నాకు క్రీడారంగం వల్లే అలవడింది. నేను చదువుకొనే రోజుల్లో పలు ఆటలపోటీలకు వెళ్లాను. అప్పుడు అందరం కలిసిమెలసి ఉండటం, సర్దుకుపోవడం జరిగేది. ఆ అలవాటు ఇప్పటికీ పోలేదు. ఎప్పటికీ పోదు'' అని చెప్పుకొచ్చింది. 

No comments:

Post a Comment