Sunday, January 9, 2011

ప్రభు దేవా, నయనతారల వివాహ వేదిక?

ప్రభు దేవా, నయనతారల వివాహ వేదిక?


సంచలన ప్రేమ జంట ప్రభుదేవా, నయనతారల వివాహానికి చెన్నై వేదిక కానుంది. విల్లు చిత్రం షూటింగ్ సమయంలో వీరి మధ్య ప్రేమ మొలకెత్తింది. వీరి ప్రేమను ప్రభుదేవా భార్య రమలత్ వ్యతిరేకించినా చివరకు విడాకులకు సమ్మతించారు. దీంతో ప్రభుదేవా, నయనతారల వివాహానికి ఆటంకం తొలగింది. దీంతో వీరు వివాహం చేసుకోవడానికి సమాయత్తం అవుతున్నారు. వివాహాన్ని హైదరాబాద్‌లో జరుపుకోవాలని ప్రభుదేవా నిర్ణయించారు. అయితే చెన్నైలోనే చేసుకోవాలని నయన పట్టుబట్టడంతో చెన్నై చేసుకోనున్నట్లు సమాచారం. పెళ్లి జూలైలో జరగనుందని వినికిడి. ఈ లోపు నయనతార ఇప్పటి వరకు ఒప్పుకున్న చిత్రాలను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ తరువాత నటించేది లేనిది ఆలోచించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 

No comments:

Post a Comment