Tuesday, January 11, 2011

లిప్ కిస్ నుంచి బికినీ వరకూ...

లిప్ కిస్ నుంచి బికినీ వరకూ...


ఆరెంజ్’ చిత్రంలో జెనీలియాతో పాటు అందర్నీ అలరించిన మరో క్యూట్‌గాళ్ షాజన్ పదంసి. తన క్యూట్ లుక్స్‌తో అందర్నీ అలరించిన ఈ తార ఎన్నో ఆశలతో తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు. కానీ తొలి చిత్రం ఊహించని షాక్ ఇవ్వడంతో పదంసి నిరాశపడినా... ‘ఆరెంజ్’ చిత్రంలో ఈ ముద్దుగుమ్మ ఓరచూపులను ఇప్పటికీ ఎవ్వరూ మరిచిపోలేకపోతున్నారు. సరైన సినిమా ఒకటి పడితే టాలీవుడ్‌లో షాజన్ కెరీర్‌కు ఢోకా వుండదనే కామెంట్స్ అప్పట్లో వినిపించినప్పటికీ తెలుగులో ఇంకో అవకాశం ఇప్పటి దాకా రాలేదు ఈ తారకి. ఇదే విషయాన్ని షాజన్ పదంసి ముందు ప్రస్తావించినప్పుడు- ‘‘ప్రస్తుతం హిందీ సినిమాలతో బిజీగా వున్నాను. తెలుగు నుంచీ ఆఫర్లు వస్తున్నాయి. కానీ నాకు నచ్చిన కథలు, పాత్రలు ఇప్పటి వరకు ఎవ్వరూ నా దగ్గరికి తీసుకు రాలేదు. హిందీ సినిమాల నుంచి ఖాళీ దొరికినప్పుడు తెలుగు సినిమాల గురించి ఆలోచిస్తాను’’ అని చెప్పుకొచ్చారు. ఎక్స్‌పోజింగ్ విషయంలో మీ అభిప్రాయం ఏంటి అని ప్రశ్నించినప్పుడు- ‘‘ఎక్స్‌పోజింగ్ విషయంలో నాకు ఎలాంటి నిబంధనలు లేవు. లిప్‌కిస్ నుంచీ టూ పీస్ బికినీ వరకూ, ఆ మాటకొస్తే సెమీ న్యూడ్.. కూడా నటనలో భాగమే కదా. కమర్షియల్ యాంగిల్ కోసమైతే నేను ఒప్పుకోను కానీ, సినిమాలో సన్నివేశం డిమాండ్ చేస్తే అభ్యంతరం లేదు’’ అని ముక్కుసూటిగా చెప్పారు షాజన్. సో.. ఎటువంటి ఎక్స్‌పోజింగ్‌కైనా సిద్ధమని చెప్పిన షాజన్‌కు త్వరలో తెలుగులో మంచి అవకాశాలు వస్తాయని ఆశిద్దాం.

No comments:

Post a Comment