Thursday, January 27, 2011

ఒక్కసారైనా కలుసుకోలేదు!

ఒక్కసారైనా కలుసుకోలేదు!

నా గురించి ఒక్కోసారి వచ్చే వార్తలు విన్నప్పుడూ చదివినప్పుడూ భలే నవ్వొస్తుంది. నాకు సంబంధం లేకుండా చాలా సంగతులు ప్రచారమవుతున్నా పట్టించుకోను. పైగా అవి కొత్త జోకులని సరదాపడుతుంటా అని చెబుతోంది ఢిల్లీ డాల్‌ శ్రియ. అంతగా నవ్వించిన వార్త ఏమిటో ఆమె మాటల్లోనే విందాం... ''దీపా మెహతా దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించేందుకు అంగీకరించాను. ఆ సినిమాకి సల్మాన్‌ రష్దీ రచించిన 'మిడ్‌నైట్‌ చిల్డ్రన్స్‌' నవల ఆధారం. అక్కడి వరకూ అంతా నిజమే. ఆ చిత్రంలో నటించేందుకు అంగీకరించగానే నేను సల్మాన్‌ రష్దీని కలిసి చర్చలు సాగించానంటూ ఏవో రకరకాల వార్తలు వెలుగులోకి వచ్చాయి. అసలు నేను ఆయన్ని ఒక్కసారైనా కలుసుకోలేదు. అందుకు సంబంధించిన విషయాలు మీడియాలో చూడగానే నాకు నవ్వాగలేదు. వీలైతే తప్పకుండా రష్దీని కలుస్తాను''. త్వరలో శ్రియ 'పానీ' అనే చిత్రంలో నటించబోతోంది. ఈ సినిమాకి శేఖర్‌ కపూర్‌ దర్శకత్వం వహిస్తారు. హృతిక్‌ రోషన్‌ కథానాయకుడు. 'స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌' దర్శకుడు డానీ బోయెల్‌ నిర్మాత.

No comments:

Post a Comment