పరిధి దాటి ప్రవర్తించను
‘‘నేను కళాకారిణిని. వృత్తి రీత్యా అందరితో కలిసి పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నా హీరోలందరితో నాకు మంచి స్నేహబంధం ఉంది. అయితే దానికి కూడా ఓ పరిధి ఉంటుంది. పరిధి దాటి నేనెప్పుడూ ప్రవర్తించను’’ అంటున్నారు కాజల్. ఇటీవల ఓ సందర్భంలో తన మనోగతాన్ని మీడియా ముందు వ్యక్తపరుస్తూ కాజల్ పై విధంగా స్పందించారు. ఇంకా ఆమె మాట్లాడుతూ- ‘‘నేను తెలుగమ్మాయిని కాకపోయినా... తెలుగు హీరోయిన్‌ని అయినందుకు గర్వపడుతున్నాను. కథానాయికలను గౌరవించడంలో తెలుగు చిత్రపరిశ్రమకు సాటి వేరే లేదు. నటిగా ఇక్కడ పూర్తి సంతృప్తిని ఎంజాయ్ చేస్తున్నాను. అందుకే ఏ భాషలో నటించినా తొలి ప్రాధాన్యత మాత్రం తెలుగుకే’’ అని చెప్పారు. మీ గ్లామర్ రహస్యం ఏంటని ఈ అందాన్ని అడిగితే- ‘‘శరీరంతో పాటు మనసును కూడా అదుపులో పెట్టుకుంటే అందం దానంతట అదే మన సొంతం అవుతుంది. టైమ్‌కి తినడం... సరిపడా నిద్ర పోవడం... వీలైనంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించడం... ఇవన్నీ శరీరాన్ని అదుపులో ఉంచితే, ఆందోళనకు దూరంగా ఉండటం... ప్రశాంతతను ఎక్కువగా ఇష్టపడటం... ఎప్పుడూ హ్యాపీగా ఉండటం లాంటివి మనసును అదుపులో ఉంచుతాయి. అందం కోసం వీటిని తప్పక పాటిస్తాను. నా అందం వెనుకున్న రహస్యం ఇదే’’ అని చెప్పుకొచ్చారు కాజల్.
No comments:
Post a Comment