కార్తీతో రొమాన్స్
స్టన్నింగ్ లుక్స్‌తో.. మోడ్రన్ కాస్ట్యూమ్స్‌తో చూడగానే క్లాస్ అమ్మాయిగా అనిపించే మిల్కీ వైట్ భామ తమన్నా. అందుకే ఇప్పటి వరకు ఈ తార క్లాస్ అమ్మాయి పాత్రలనే చేసింది. మాస్ పాత్రలకు, విలేజ్ గాళ్ పాత్రలకు ఆమె సరిగ్గా నప్పదని దర్శకులు కూడా ఆమెతో ఆ తరహా పాత్రలు చేయించటానికి ఇష్టపడటం లేదు. కానీ ఇప్పుడు తమన్నా క్లాస్ ఇమేజ్ నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నారు. కేవలం క్లాస్ పాత్రలే చేస్తే మాస్ ఆడియన్స్‌కు చేరువ కాలేనన్న విషయాన్ని అర్థం చేసుకున్నారు. అందుకే ఇప్పుడామె తమిళంలో కార్తీ సరసన నటిస్తున్న ‘సిరుత్తె’ చిత్రంలో మాస్ లుక్‌తో కనిపించనున్నారు. తెలుగు విక్రమార్కుడు చిత్రానికి రీమేక్‌గా నిర్మాణం జరుపుకుంటోన్న ఈ చిత్రానికి శివ దర్శకుడు. గతంలో ఈయన తెలుగులో గోపీచంద్‌తో శౌర్యం, శంఖం చిత్రాలను తెరెకెక్కించారు. కాగా తెలుగు విక్రమార్కుడు చిత్రంలో రవితేజ, అనుష్కల మధ్య పలు రొమాంటిక్ సన్నివేశాలు వున్న సంగతి తెలిసిందే. ఈ తరహాలోనే తమన్నా, కార్తీలు కూడా ఈ రీమేక్ సినిమాలో ఆ రొమాంటిక్ సన్నివేశాల్లో పోటీ పడి నటించారట. మాస్‌ను ఈ సన్నివేశాలు విపరీతంగా అలరిస్తాయని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అంతే కాదు... వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కవుట్ అయ్యిందని తమిళ సినీ పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
No comments:
Post a Comment