నిర్మాతకు షాక్ ఇచ్చిన కత్రినా
ఇటీవల ఓ దక్షిణాది నిర్మాత కత్రినాను కలిశాడట. తన సినిమాలో నటించాల్సిందిగా కోరి, అధిక పారితోషికం ఆఫర్ చేశాడట. ఆ పారితోషికం విని కత్రినా షాక్ అవుతారని సదరు నిర్మాత భావిస్తే... ఆ నిర్మాతనే షాక్‌కు గురిచేస్తూ... పదికోట్లు పారితోషికం అడిగారట కత్రినా. అంత మొత్తం ఇస్తే గానీ దక్షిణాదిలో చేయన నీ, ‘తీన్ మార్ ఖాన్’ విడుదల తర్వాత ఎలాగూ తన పారితోషికం పదికోట్లు అవ్వడం ఖాయమని పేక మేడలు కట్టేశారట కత్రినా. దాంతో కిమ్మనకుండా ఆ నిర్మాత వెనుదిరిగారట. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ అవసరమా? అని కత్రినాను అడిగితే ‘‘అది ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఎందుకనుకుంటున్నారు...? కాన్ఫిడెన్స్ అని ఎందుకు అనుకోరు..?’’ అని ఎదురు ప్రశ్నించారు ఈ సెక్సీబ్యూటీ. ఇంకా ఆమె మాట్లాడుతూ- ‘‘తీన్‌మార్ ఖాన్’ కోసం నేను పడ్డ శ్రమ అలాంటిది. పాత్ర కోసం నా శరీరాకృతిని కూడా మార్చుకున్నాను. నాకు జీరో సైజులపై, కొలతలపై అస్సలు అవగాహన లేదు. కానీ ఈ పాత్ర కోసం ఎంతో కష్టపడి నా ఆకృతిలో మార్పును తెచ్చుకున్నాను. నటన విషయంలో, డాన్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చేశాను. అవన్నీ కలిసి వస్తాయని నమ్మకంతో ఉన్నాను’’ అని చెప్పారు కత్రినా. మరికొన్ని విషయాలను ఆమె చెబుతూ- ‘‘పర్‌ఫెక్ట్ ఫిజిక్ అంటే... నా దృష్టిలో జీరో సైజు కాదు. కాస్తంత బొద్దుగా ఉంటేనే అందానికీ, ఆరోగ్యానికీ మంచిదని నా అభిప్రాయం. ‘తీన్ మార్ ఖాన్’ తర్వాత మళ్లీ మునుపటి ఫిజిక్ కోసం ప్రయత్నిస్తా. నచ్చిన తిండి తినడం, వీలైనంత సేపు నిద్రపోవడం, ఎక్కువగా ఆలోచించకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం నా అందానికి కారణాలు’’ అని చెప్పుకొచ్చారు కత్రినా.
నిర్మాతకి షాకులిచ్చే పవర్ చిత్రరంగంలోని ప్రతివారి సొంతం..అవి లేదా వాటిని తినడమే నిర్మాత విద్యుక్త్ధర్మం
ReplyDelete