బిపాసా అంటే నాకు అసూయ
‘‘మీలో మీకు నచ్చనిది ఏంటి?’’ అనే ప్రశ్నను సోనమ్ కపూర్ ముందుంచితే.. ‘నా కాళ్లు’ అని ఠకీమని చెబుతారు. అద్దం ముందు నిలబడినప్పుడు పొరబాటున కూడా తన కాళ్ల వైపు చూసుకోరట. ‘‘నాకు కనుక బిపాసా బసులాంటి కాళ్లు ఉండి ఉంటే ఎంత బాగుంటుందో.. బిపాసా కాళ్లు చాలా బాగుంటాయి. అంత అందమైన కాళ్లను సొంతం చేసుకున్న బిపాసా అంటే నాకు అసూయ’’ అంటున్నారు సోనమ్. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ‘ప్లేయర్స్’ అనే చిత్రం రూపొందుతోంది. మామూలుగా ఇద్దరు నాయికలు ఓ సినిమాలో కలిసి నటిస్తే.. కచ్చితంగా మనస్పర్థలు ఉంటాయంటారు. కానీ సోనమ్, బిపాసా ఆ మాటలు తప్పని నిరూపిస్తూ.. స్నేహంగా ఉంటున్నారట.
No comments:
Post a Comment