అందుకే నా గురించి వదంతులు రావు
‘‘వేదాంతాలు వల్లిస్తున్నానని అనుకోకపోతే ఓ మాట చెబుతా. ‘మనకు ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది. ఏదైనా మనకు దక్కాలి అని ఉంటే మనం వద్దనుకున్నా అది దక్కే తీరుతుంది’’ అంటున్నారు కాజల్ అగర్వాల్. ఇలియానా, త్రిష, సమంత లాంటి తారలు మీకు గట్టి పోటీనిస్తున్నారు కదా? ఆ విషయంపై మీ ఫీలింగ్ అన్నప్పుడు ఈ బ్యూటీ పై విధంగా స్పందించారు. మరింత వివరంగా చెబుతూ - ‘‘ఏడాదికి దాదాపు వంద సినిమాలు రూపొందుతాయి. అందుకని ఎంతమంది కథానాయికలున్నా అందరికీ అవకాశాలు దక్కుతాయి.పైగా మేం ఒకే భాషకు పరిమితం కావడంలేదు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడం, మలయాళం.. అంటూ దక్షిణాది భాషలన్నింట్లోనూ చేస్తున్నాం. కాబట్టి పోటీ విషయంలో నేను ఏమాత్రం భయపడటంలేదు. అలాగే ఇతర తారల అవకాశాలను లాక్కోవాలని అనుకోను. నాదాకా వచ్చిన మంచి అవకాశాన్ని వదులుకోను’’ అన్నారు కాజల్. సినిమాల్లో బబ్లీగా యాక్ట్ చేసే కాజల్ విడిగా కూడా అలాగే ఉంటారు. అందరితో కలిసిపోయి స్నేహంగా మాట్లాడుతుంటారు. తెలుగు పరిశ్రమలో తనకు చాలామంది స్నేహితులు ఉన్నారని కాజల్ చెబుతూ - ‘‘నేను అందరితో కలివిడిగా ఉంటాను కాబట్టి నాతో కూడా అలానే ఉంటారు. ఎక్స్‌ట్రాలు చేయను. హద్దులో ఉంటాను కాబట్టి.. ‘ఫలానా హీరోతో కాజల్‌కు లవ్ అట’లాంటి వదంతులు నా గురించి రాలేదు. షూటింగ్ అయిన తర్వాత ఇంటికి వెళ్లిపోతాను. పబ్‌లకు దూరంగా ఉంటాను. వేళ కాని వేళ్లల్లో పార్టీలు చేసుకోను. క్రమశిక్షణగా ఉంటాను కాబట్టే నా గురించి ఎవరూ చెడుగా మట్లాడరు’’ అంటున్నారు.
No comments:
Post a Comment