Wednesday, December 29, 2010

హాలీవుడ్‌లో రొమాన్స్

హాలీవుడ్‌లో రొమాన్స్


సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న కథానాయికల జాబితాలో విమలారామన్ కూడా వుంటారు. కెరీర్ తొలినాళ్లలో ఉదయ్‌కిరణ్, వరుణ్‌సందేశ్ లాంటి యువ కథానాయకులతో జతకట్టినా ఈ తార ఇప్పుడు సీనియర్ కథానాయకులతో రొమాన్స్ చేస్తున్నారు. ఇటీవల ‘గాయం-2’ చిత్రంలో జగపతిబాబుతో నటించిన ఈ భామ త్వరలో రంగ ది దొంగ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సబ్ ఇన్‌స్పెక్టర్ మంగమ్మగా ఈ చిత్రంలో విమలా కనిపించనున్నారు. ఇక సుమంత్‌తో నటించిన రాజ్, తరుణ్‌తో జతకట్టిన చుక్కలాంటి అమ్మాయి-చక్కనైన అబ్బాయి చిత్రాలు విడుదలకు సిద్ధంగా వున్నాయి. ఇదిలా వుండగా ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగిన ఈ భామ ఓ హాలీవుడ్ చిత్రంలో కూడా నటించారని తెలిసింది. రోహన్ రాయ్ రూపొందించిన ‘డ్రామ్ ట్రిపుల్ నైన్’ అనే చిత్రంలో విమల హాలీవుడ్ నటుడు జోష్వా ఫెడరిక్‌తో హాట్ హాట్ సన్నివేశాల్లో నటించారట. ఆశిష్ విద్యార్థితో పాటు ‘వాన’ ఫేమ్ వినయ్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రం 2011 ఏప్రిల్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని సమాచారమ్. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో హీరోయిన్‌గా బిజీగా వున్న విమల తను నటించిన హాలీవుడ్ చిత్రంతో ఏ రేంజ్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంటారో తెలియాలంటే ‘డ్రామ్ ట్రిపుల్ నైన్’ విడుదల వరకు ఆగాల్సిందే.

No comments:

Post a Comment