తెలియక పొరపాటు చేశా
‘ప్రతిభకు తగ్గ ప్రతిఫలం దక్కినప్పుడు కలిగే ఆనందానికీ, తృప్తికి విలువ కట్టలేం. ‘పరుత్తివీరన్’ చిత్రానికి జాతీయ ఉత్తమనటిగా ఎంపికైనప్పుడు అలాంటి అనుభూతినే పొందాను. ప్రస్తుతం ‘రక్తచరిత్ర’ విజయం కూడా దాదాపు అలాంటి అనుభూతినే ఇచ్చింది’’ అంటున్నారు ప్రియమణి. ‘రక్తచరిత్ర’ చిత్రంలోని తన పాత్రకు ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ మంచి స్పందన వస్తోందని, ఇది గ్లామర్ తారగా కాకుండా, ఒక నటిగా నేను సాధించిన విజయం అని చెప్పారు ప్రియమణి. ఇంకా ఆమె మాట్లాడుతూ- ‘‘ఇంకొన్ని రోజుల్లో వెళ్లిపోతున్న ఈ 2010 నా జీవితంలో మరచిపోలేని సంవత్సరం. మణిరత్నం, రామ్‌గోపాల్‌వర్మ లాంటి దేశం గర్వించదగ్గ దర్శకులతో పనిచేసే అవకాశం ఇచ్చిన సంవత్సరం ఇది. అందుకే నా లైఫ్‌లో ఇదొక మెమరబుల్ ఇయర్’’ అన్నారు. మరికొన్ని విషయాలను ప్రియమణి చెబుతూ- ‘‘నాకు నటన అంటే ఇష్టం. తొలినాళ్లలో కొన్ని పరాజయాలు నాకు చేదు అనుభవాలను మిగిల్చాయి. ఇక నటన జోలికి వెళ్లకుండా మోడలింగ్ వైపే దృష్టిపెడదాం అనుకున్నాను. అలాగే చే శాను కూడా. కానీ ఏదో తెలియని వెలితి. నేను చేస్తుంది కరెక్ట్ కాదని అనిపించింది. ఆ సమంలోనే పరుత్తివీరన్ అవకాశం వచ్చింది. ఆ విజయం నా జీవితాన్నే మార్చేసిన విషయం తెలిసిందే’’ అని గతాన్ని నెమరువేసుకున్నారు ప్రియమణి. ‘‘ఇక్కడ నిలదొక్కుకోవాలంటే గ్లామర్ ఒలికించక తప్పదు. అందుకే స్థిరత్వం కోసం గ్లామర్ బాట పట్టాను. కానీ కొన్ని సందర్భాల్లో కొందరి మాటలు నన్ను పక్కదారి పట్టించాయి. బికినీలంటే నాకు పెద్ద ఇష్టం ఉండదు. ‘ద్రోణ’కు ముందు బికినీలో ఎవరైనా కనిపించారా...? అనే విషయం కూడా తెలీదు. ‘స్టైల్‌గా పాటను తీస్తాం... ‘తుషార్’ చిత్రంలో కరీనా కపూర్‌లా మిమ్మల్ని చూపించాలనేది నా తపన’ అని నాతో బికినీలో నటింపజేశారు ఆ చిత్ర దర్శకుడు. కానీ తర్వాత నేను ఎదుర్కొన్న విమర్శలు నాకు ఎంతో బాధ కలిగించాయి. అందుకే ఇక నుంచి గ్లామర్ విషయంలో కూడా కొన్ని పరిధులను పాటించాలనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు ప్రియమణి.
No comments:
Post a Comment