అది సినిమా పెళ్లంటే నమ్మరేంటి?
సల్మాన్ మంచి నటుడే కాదు... మంచి జోకర్ కూడా. తనతో మాట్లాడుతుంటే కాలం ఇట్టే గడిసిపోతుంది. ప్రాక్టికల్ జోకులు వేసి ఒక్కోసారి ఇబ్బందులకు కూడా గురిచేస్తారాయన. మనకు కోపం వచ్చిందనుకోండి... మళ్లీ వెంటనే నవ్వించేస్తారు’’ ఇటీవల ఓ ఛానెల్ కార్యక్రమంలో అసిన్ అన్న మాటలివి. ఇలా సల్మాన్ గురించి కబుర్లు చెప్పాల్సిన అవసరం అసిన్‌కి ఏంటి... అనుకుంటున్నారా? విషయం ఏంటంటే... వీరిద్దరూ బాలీవుడ్‌లో ‘రెడీ’ రీమేక్‌లో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మొదలైన నాటి నుంచి వీరి మధ్య ఎఫెక్షన్ బాగా ముదిరిందని, ఒకర్ని వదిలి ఒకరు ఉండలేకపోతున్నారని బాలీవుడ్‌లో పుకార్లు షికార్లు కొడుతున్నాయి. అంతేకాక, ‘రెడీ’ సినిమాలో పెళ్లికూతురు, పెళ్లికొడుకు గెటప్‌లో ఉన్న వీరిద్దరి స్టిల్ ఈ మధ్య బయటకు వచ్చింది. ఇక బాలీవుడ్ జనాలు ఈ స్టిల్ చుట్టూ కథలు అల్లేస్తూ... వీరిద్దరికీ పెళ్లి కూడా అయిపోయిందని చెప్పడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఛానల్ కార్యక్రమంలో వీరిద్దరూ పాల్గొనడం జరిగింది. ఆ కార్యక్రమంలో సదరు యాంకర్ ఈ ఫొటో మేటర్‌ని బయట పెట్టి.. దీనికి మీ సమాధానం ఏంటని సల్మాన్‌ని అడిగింది. దానికి ఆయన సమాధనమిస్తూ-‘‘ అబ్బా.. ఈ గాసిప్ నిజమైపోతే ఎంత బావుండో...’’ అంటూ అసిన్ వంక అదోలా చూస్తూ... మెలికలు తిరిగిపోయారట. లక్షలాది మంది చూసే కార్యక్రమంలో సల్మాన్ అలా ప్రవర్తించే సరికి అసిన్ కాస్తంత ఇబ్బందిగా ఫీలైపోతూ... ‘‘ఈయన భలే జోకులు వేస్తారు. అవన్నీ ఉత్తుత్తి గాలి కబుర్లు. వాటిని లెక్క చేయాల్సిన పనిలేదు. ఆ స్టిల్ మేం సినిమా కోసం ఇచ్చిందే’’ అని కవర్ చేశారట. తదనంతరం ఆమె పై విధంగా స్పందించారట. ఏదేమైనా నిప్పు లేకుండా పొగ రాదంటారు. మరి ఈ పొగకు కారణం ఏంటో!
No comments:
Post a Comment