నెల తప్పి నెల రోజులైంది
సెక్సీభామ మల్లికా షెరావత్ నటించిన ‘హి..స్..స్..స్..’ చిత్రం ఇటీవలే విడుదలై ‘తుస్...స్...స్’ అనిపించుకున్న విషయం తెలిసిందే. విడుదలకు ముందు ఈ సినిమా గురించి తెగ గొప్పలు చెప్పుకున్న ఈ సెక్స్ బాంబ్... ఫలితం చూసి కుదేలైపోయుంటారని అందరూ భావించారు. కానీ మల్లికలో సినిమా ఫ్లాప్ అయ్యిందన్న బాధ ఇసుమంత కూడా కనిపించడంలేదు. బాధ పడకపోగా తన ట్విట్టర్‌ని ఫాలో అయ్యేవారిని ఫూల్స్ చేస్తూ... ఆ విధంగా తన పబ్లిసిటీని పెంచుకుంటున్నారు. విషయంలోకెళితే... ఇటీవలే మల్లిక తన ట్విట్టర్‌లో ‘‘నేను నెల తప్పి నెల రోజులైంది. ప్రస్తుతం నేను గర్భవతిని’’ అంటూ ఓ మెసేజ్ పోస్ట్ చేశారు. ఈ మెసేజ్ చూడగానే ఆమె ఫాలోయర్స్‌కు కడుపు ఉబ్బరం అగక ‘‘ఈ పుణ్యం కట్టుకున్న పురుష పుంగవుడు ఎవరు...?’’ అని అడిగారట. దాంతో ఈ అందాల భామ వారి ఆరాటం చూసి... నవ్వు ఆపుకోలేకపోయారట. వెంటనే ‘జస్ట్ జోక్’’ అంటూ మరో మెసేజ్ పోస్ట్ చేశారట. దాంతో వారి ఉత్సాహం కాస్తా నీరుగారిపోయిందని సమాచారం. ఇటీవల కొందరు హీరోయిన్లు ట్విట్టర్స్‌ను తమ సొంత పబ్లిసిటీకి వాడుకుంటున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే... మల్లిక ఈ మెసేజ్‌లు పోస్ట్ చేసి ఉంటారని కొందరు అనుకుంటున్నారు. ఏదీ ఏమైనా ఏప్రిల్ రావడానికి నాలుగు నెలలకు ముందే ఫాలోయర్స్‌ను ఫూల్స్ చేశారు మల్లిక.
No comments:
Post a Comment