Monday, December 20, 2010

దేనికైనా ఛాలెంజ్

దేనికైనా ఛాలెంజ్


భరత్‌తో ప్రియమణి ‘బెట్’ కట్టబోతున్నారు. ఇది నిజం బెట్ కాదు. సినిమా బెట్. అంటే ఆ సినిమా పేరే ‘బెట్’ అన్నమాట. ప్రముఖ దర్శకుడు సురేష్‌కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఓ తమిళ చిత్రానికి ‘బెత్’ తెలుగు అనువాద రూపం. ‘దేనికైనా ఛాలెంజ్’ అనేది ఈ చిత్రానికి ఉపశీర్షిక. భరత్, ప్రియమణి జంటగా నటించిన ఈ చిత్రాన్ని శిల్పి క్రియేషన్స్ పతాకంపై తొండపు నాగేశ్వరరావు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ప్రేమ, స్నేహం ఇందులో ప్రథానాంశం. వాటికి సరికొత్త నిర్వచనాన్ని ఈ చిత్రంలో చెప్పాం. స్నేహం కోసం ప్రాణాలిచ్చే పాత్రలో భరత్ పాత్ర చిత్రణ చిత్రణ ఆకట్టుకుంటుంది. భరత్, ప్రియమణి మధ్య జరిగే సన్నివేశాలు పాటలు చాలా బాగుంటాయి. వైజాగ్, మారిషస్, దుబాయ్‌ల్లో ఈ చిత్రం షూటింగ్ జరిగింది. కొత్త సంవత్సరంలో తొలి రోజున తొలి చిత్రంగా అంటే జనవరి 1న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు.ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, సంగీతం: దేవా, కెమెరా: భూపతి, నిర్మాణ సారథి, సీహెచ్‌వీయస్‌ఎస్ బాబ్జీ.

No comments:

Post a Comment