టబు కొడుకు ఇర్ఫాన్
తెరపై కొన్ని పాత్రలు భలే విచిత్రంగా ఉంటాయి. వారిని ఆ పాత్రల్లో నటింపజేయాలనే ఆలోచన రావడమే దర్శకులకు ఓ సాహసమని చెప్పాలి. ముఖ్యంగా టబు, ఇర్ఫాన్ ఖాన్ - వీరి మధ్య ప్రణయ సన్నివేశాలు చక్కగా పండుతాయి. 'మఖ్బూల్', 'ది నేమ్ సేక్' సినిమాలే ఉదాహరణ. అయితే వారిని తల్లీకొడుకులుగా చూపించాలని తైవాన్‌కి చెందిన ఆంగ్ల దర్శకుడు ఆంగ్ లీ అనుకోవడం విచిత్రమే. ఆయన రూపొందించబోయే సినిమా 'లైఫ్ ఆఫ్ పి'. ఇందులోనే టబు తనయుడిగా ఇర్ఫాన్ కనిపించబోతున్నారు. తొలుత ఇర్ఫాన్ ఖాన్, టబు ఈ సినిమాలో నటిస్తున్నారనే విషయం తెలియగానే అందరూ సాధారణంగానే జంటగా కలిసి నటించబోతున్నారని అనుకున్నారు. కానీ ఇర్ఫాన్ అసలు విషయం చెప్పగానే అందరూ ఆశ్చర్యపోయారు.
No comments:
Post a Comment