Monday, December 13, 2010
మసాజ్ పార్లర్‌లో ఏం జరిగింది?
అవినాష్, సలీమ్, మల్లిక, సుమ కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'మల్లిక మసాజ్ సెంటర్'. బాలీవుడ్‌లో విడుదలైన ఓ చిత్రాన్ని ఈ పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. ఎస్.వి.రమణ, మహిపాల్‌రెడ్డి నిర్మాతలు. రసూల్ ఆలమ్ దర్శకత్వం వహించారు. నిర్మాతలు మాట్లాడుతూ "ఉద్యోగరీత్యా బ్యూటీపార్లర్‌లో చేరిన ఓ యువతి అనుకోకుండా మర్డర్ మిస్టరీలో చిక్కుకుంటుంది. ఆ సమస్య నుంచి ఆమె ఎలా బయటపడింది అనేది కథాంశం. పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో యువతను ఆకట్టుకునే అంశాలు ఎన్నో వున్నాయి. ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా ఉంటుంది. తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉంది. ఈ నెల 25న తెలుగులో విడుదల చేస్తాం. తర్వాత తమిళంలోనూ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామ''ని అన్నారు. అవినాష్, సలీమ్, మల్లిక, సుమ, దీపక్, ఫిరోజ్‌ఖాన్ తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: పి.వి.రవీంద్రరెడ్డి, నిర్మాణం: ఇస్కాన్ క్రియేషన్.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment