Thursday, December 16, 2010

బికినీకి రెడీ

బికినీకి రెడీ

మీరు ఒక పని ఒప్పుకున్నారనుకోండి.. మీ బాస్‌ని మెప్పించడానికి హార్డ్‌వర్క్ చేస్తారు కదా. నేను కూడా అంతే.. నా అభిమానులను సంతోషపెట్టాలనే ధ్యేయంతో కృషి చేస్తాను. అసలు వాళ్లు థియేటర్లకు ఎందుకు వస్తారు? మా అందాలను చూసి తరించాలనే గదా. నేను బికినీ ధరిస్తే నా అభిమానులు ఆనందపడతారు. అందుకే సీన్ డిమాండ్ చేస్తే.. బికినీ ధరించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తా. అలాగే ప్రముఖ పత్రికల ముఖచిత్రాలపై బికినీలో దర్శనమివ్వడానికి పచ్చజెండా ఊపిన సందర్భాలు ఉన్నాయి. ఆ కవర్‌పేజీని కత్తిరించి గోడకు అంటించుకున్నామని అభిమానులు చెప్పినప్పుడు నాకు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు’’ అంటున్నారు శ్రీయ. అంగాంగ ప్రదర్శనపరంగా ఆమె ఎలాంటి నియమాలు పెట్టుకోరు. పబ్లిక్ ఫంక్షన్స్‌కి వచ్చినప్పుడు కూడా సాధ్యమైనంతవరకు గ్లామరస్ డ్రెస్సులే వేసుకొస్తారామె. ఈ విషయం గురించి అడిగినప్పుడు శ్రీయ పై విధంగా స్పందించారు. ప్రస్తుతం ఈ బ్యూటీ చెన్నయ్‌లో ఉన్నారు. అక్కడ ‘ఫొటోషూట్’ జరుగుతోందట. అర్ధరాత్రి చెన్నయ్‌లోని ప్రముఖ వీధులలో ఈ ఫొటోషూట్ చేస్తున్నారు. దీనికోసం కెన్యాకి చెందిన ఫ్యాషన్ డిజైనర్ సిడ్నీతో ఆమె ప్రత్యేకంగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేయించుకున్నారు. ఈ షూట్ గురించి శ్రీయ చెబుతూ - ‘‘రాత్రిపూట చెన్నయ్ మహానగరం సుందరంగా ఉంటుందన్న సంగతి నాకిప్పుడు తెలిసింది. ఇప్పటివరకు నేను కొన్ని ఫొటోషూట్స్‌లో పాల్గొన్నాను. కానీ రాత్రిపూట చేయడం ఇదే తొలిసారి. ఇదొక కొత్త అనుభూతినిస్తోంది’’ అన్నారు.

No comments:

Post a Comment