ఆయన అనుమతితో బర్త్‌డే జరుపుకున్నా
మంగళవారం రాత్రి నా ముద్దుల సోదరి నాకోసం ఓ ‘గెట్ టు గెదర్’ పార్టీ ఏర్పాటు చేసింది. ఆ పార్టీలో నా క్లోజ్ ఫ్రెండ్స్ పాల్గొన్నారు. చల్లని వాతావరణంలో పార్టీ చేసుకుంటుంటే చెప్పలేనంత ఆనందం కలిగింది’’ అంటున్నారు సమీరారెడ్డి. ఈ 14న తన పుట్టినరోజు. సరిగ్గా ఆ రోజు షూటింగ్ ఉండటంతో బర్త్‌డే ఎంజాయ్‌మెంట్‌ని మిస్ అయినట్లేనని సమీరా అనుకున్నారు. ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో ఆమె ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నారు. చెన్నయ్‌లో ఈ షూటింగ్ జరుగుతోంది. కానీ బర్త్‌డే సందర్భంగా సమీరాకు ప్రభుదేవా శెలవు ఇచ్చారట. దర్శకుడు శెలవు ప్రకటించగానే స్కూల్ పిల్లలా సంబరపడిపోతూ సమీరా ముంబయ్ ఫ్లయిట్ ఎక్కి, ఇంట్లో వాలిపోయారు. ఆ విషయం గురించి చెబుతూ - ‘‘ప్రస్తుతం రెండు తమిళ చిత్రాల్లో, రెండు హిందీ మూవీస్‌లో నటిస్తూ బిజీగా ఉన్నాను. బర్త్‌డే నాడు అమ్మానాన్నలతో గడిపితే బాగుండు అనుకున్నాను. అయితే దర్శక,నిర్మాతలను శెలవు అడగడానికి మొహమాటమనిపించింది. ప్రభుదేవా సార్ నా పరిస్థితిని అర్థం చేసుకున్నారో ఏమో ఆయనంతట ఆయననే అనుమతి ఇచ్చారు. కుటుంబ సభ్యులతో బర్త్‌డే జరుపుకోవడంతో నూతనోత్సాహం కలిగింది’’ అన్నారు. ప్రభుదేవా దర్శకత్వంలో చేస్తున్న సినిమా గురించి చెబుతూ - ‘‘ఈ చిత్రంలో నేను చాలా మంచి పాత్ర చేస్తున్నాను. ఈ సినిమా గురించి చర్చలు జరిపినప్పుడు ప్రభు సార్ ‘వెరీ టాలెంటెడ్’ అనుకున్నాను. షూటింగ్ ఆరంభించిన తర్వాత ఆ అభిప్రాయం బలపడింది. ఆయన చాలా ఎనర్జిటిక్. విశ్రాంతి కోరుకోరు. చాలా యాక్టివ్‌గా ఉంటారు’’ అన్నారు సమీరా రెడ్డి. |
No comments:
Post a Comment