Saturday, October 8, 2011

పిచ్చతాగుడు తాగుతున్న కాజల్ అగర్వాల్!!

పిచ్చతాగుడు తాగుతున్న కాజల్ అగర్వాల్!!
తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఈ ముద్దుగుమ్మ ఇమేజ్‌ను "మగధీర" చిత్రం ఎక్కడికో తీసుకెళ్లింది. ఆ తర్వాత కోలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు చెన్నయ్‌లో అడుగుపెట్టింది. అక్కడ ఒకటిరెండు ఆఫర్లు రావడంతో.. తనకు గుర్తింపునిచ్చిన తెలుగు చిత్రసీమను కించపరిచేలా మాట్లాడింది. ఆ తర్వాత తన ఇమేజ్‌ను పెంచుకునేందుకో.. లేక నాలుగు కాసులకు కక్కుర్తిపడో తెలియదు గానీ.. ఒక ఆంగ్ల పత్రికకు టాప్‌లెస్‌గా ఫోటో ఇచ్చింది. దీనిపై పెద్ద దుమారమే చెలరేగడంతో ఆ ఫోటో తనది కాదని, అది మార్ఫింగ్ చేశారంటూ బుకాయించింది. ఇంతలో ఆ మ్యాగజైన్ యజమానులు పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించడంతో "అలా కనిపిస్తే తప్పేంటంట" అంటూ మాట మార్చింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో కాలు మోపేందుకు మరెన్నో జిమ్మిక్కులు చేసింది. అవికూడా ఫలించలేదు కదా.. చెడ్డపేరును తెచ్చిపెట్టాయి.
దీంతో అటు తెలుగు చిత్రసీమలో ఆఫర్లు లేక.. కోలీవుడ్, బాలీవుడ్ ఆదుకోక పోవడంతో తన పరిస్థితి దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. అంతేకాకుండా దక్షిణాదిలో తనకున్న క్రేజ్‌ను, డిమాండ్‌ను తన చేతులారా చెడుపుకున్నాననే బాధ, నిరాశనిస్పృహలో కొట్టుమిట్టాడుతోంది. ఈ డిప్రెషన్ నుంచి బయటపడేందుకు పిచ్చతాగుడుకు బానిసై పోయినట్టు వినికిడి. ఈ తాగుడు కారణంగా తన అందం కూడా పాడు చేసుకుంటోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఉబ్బిపోయిన ముఖంతో కనిపిస్తున్న కాజల్‌ని చూసి సినీజనం తెగ గుసగుసలాడేసుకుంటున్నారు. కొందరైతే ప్రభాస్‌తో పెరిగిన దూరమే కాజల్ పిచ్చి చేష్టలకి కారణమని చెపుతుండగా, మరికొందరు మాత్రం అవకాశాలు లేకపోవడం వల్లే కాజల్ తాగుబోతుగా మారిందని చెపుతున్నారు.
సంబంధిత సమాచారం

No comments:

Post a Comment