Saturday, October 29, 2011

నాగార్జున "డమరుకం" ఓ కాపీ సినిమానా..?!!‌!

నాగార్జున "డమరుకం" ఓ కాపీ సినిమానా..?!!‌!


అక్కినేని నాగార్జున తాజాగా నటిస్తోన్న చిత్రం 'డమరుకం'. కామెడీ చిత్రాలు తీసుకునే శ్రీనివాసరెడ్డికి నాగ్‌ను దర్శకత్వం వహించే ఛాన్స్‌ వచ్చింది. ఆర్‌.ఆర్‌.మూవీ మేకర్స్‌ వెంకట్‌రెడ్డి తనవాడుగా భావించి శ్రీనివాసరెడ్డికి బాధ్యత అప్పగించారు. ఈ సినిమా వ్యవహాలను అచ్చిరెడ్డి చూస్తున్నారు. కుబేరులు వంటిచిన్న చిత్రాలు తీసే శ్రీనివాసరెడ్డికి పెద్ద సినిమా ఎలా వచ్చిందని మొదట ఆశ్చర్యపోయారు. తను ఒక టీమ్‌ను తయారుచేసుకుని భారీబడ్జెట్‌ కథను వెంకటరెడ్డికి వినిపించారు. దాంతో అది నచ్చి నాగ్‌కు చెబితే ఆయన ఓకే అన్నారు. ఇంతకీ ఈ చిత్రానికి మూలం 'ది ఇమ్మోర్టల్స్‌ ఆఫ్‌ మెలూహా' అనే విదేశీ చిత్రం. ఒక రకమైన కాపీ సినిమా ఇది. ఈ చిత్రం షూటింగ్‌ అప్పుడప్పుడు జరుగుతోంది. ఇటీవలే సారథిలో వేసిన సెట్స్‌తో చిత్రం ఒక షెడ్యూల్‌ పూర్తయింది. తాజాగా అన్నపూర్ణలో వేసిన సెట్లో జరుగుతోంది. ఈమధ్యలో రాజన్న చిత్రాన్ని నాగ్‌ పూర్తిచేశారు. మరి ఈ కాపీ సినిమా ఎంతరకు వర్కవుటుందో చూడాలి. 

No comments:

Post a Comment