మధురిమను చుట్టుముట్టి ఒత్తేసిన మాస్ జనం
అందాల తార మధురిమకు నేచురల్ బ్యూటీగా పేరుంది. ఈ తార బజాజ్ ఎలక్ట్రానిక్స్ బంపర్ డ్రా కార్యక్రమానికి హాజరయ్యేందుకు అక్కడికి వెళ్లింది. ఆమె వస్తుందన్న విషయాన్ని ముందే తెలుసుకున్న కుర్రకారు అక్కడికి పెద్దసంఖ్యలో చేరుకున్నారు. ఇంతలో అమ్మడు అక్కడికి రానే వచ్చింది. అసలే అందగత్తె. అలా రోడ్డుపై దిగి వంటరిగా నడిచి వస్తుంటే.. ఆ అందాలను చూసి ఆగలేని మాస్ జనం ఆమెపైకి ఎగబడ్డారట. ఎలాగోలా తప్పించుకుని బయటపడదామనుకునేలోపే ఆ ప్రాంతమంతా చీమలదండులా మారిపోయిందట. ఆమె చుట్టూ చేరి శరీరాన్ని బాగా ఒత్తిడికి గురి చేశారట. ఇది తట్టుకోలేక, బయటపడలేక ఏడ్వడటం మొదలెట్టిందట మధురిమ. అయినా వదిల్లేదట మాస్. దీంతో రోడ్డుపైనే బోర్లా పడుకుని రోదించడం మొదలెట్టిందట. ఇదిలావుండగానే ఆమె చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగును ఒకతను దొరకబుచ్చుకుని అక్కడ్నుంచి తుర్రుమన్నాడట. ఇంతలో షాపువారు ఎలాగోలా పరిస్థితిని దారికి తెచ్చేసరికి మధురిమ తోటకూర కాడలా మారిపోయిందట. వారివైపు గుడ్లురిమి చూస్తూ.. ఏడుస్తూ కారెక్కి వెళ్లిపోయిందట. అందగత్తెలు అలా రోడ్డుపై కనబడితే మాస్ మైమరిచిపోవడం జరుగుతూనే ఉన్నది. మరి అది గుర్తించి వెళితేనే బ్యూటీలకు సేఫ్.
No comments:
Post a Comment