Thursday, October 13, 2011

బాలకృష్ణ వదిలేసిన కథనేనా చిరంజీవి చేసేది..?!!


మెగాస్టార్‌గా సినిమాల్లో వెలిగిపోయి రాజకీయస్టార్‌గా ఎదగలేక తిరిగి వచ్చిన చిరంజీవి ఎటువంటి సినిమా చేయాలనే డైలమాలో ఉన్నారట. అయితే కథాచర్చలు మాత్రం తెగ జరిగిపోతున్నాయి. పరుచూరి బ్రదర్స్‌ దాన్ని భుజాలపై వేసుకున్నారు. ఇదిలావుంటే ఒకప్పుడు బాలకృష్ణతో తీయాలనుకున్న కథనే చిరుతో చేద్దామంటూ చర్చిస్తున్నారట. అదే స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ. ఆయన అల్లూరి సీతారమరాజు కంటే ముందుతరం వాడు. బ్రిటీష్‌ పాలకులపై తిరగబడ్డ నాయకుడు. అదే కథను చిరంజీవితో చేయాలనే ఏడాది క్రితం స్క్రిప్ట్‌ వర్క్‌ జరిగింది. దానికి కొందరు పేరున్న రచయితలు కూడా పనిచేశారు. అయితే రాజకీయాల్లోకి వెళ్ళిపోవడంతో చిరంజీవి సినిమా పక్కన పడేశారు.

No comments:

Post a Comment