సినీ పరిశ్రమలో దాదాపు 70 శాతం మందికి డ్రగ్స్ అలవాటు ఉన్నదని టాలీవుడ్ భోగట్టా. దీనికి బలం చేకూరే విధంగా ఎప్పుడు ఎక్కడ డ్రగ్స్ కేసులో ఎవరు పట్టుపడ్డా... అందులో సినీప్రముఖులు ఉంటున్నారు. కేవలం మత్తులో జోగడమే కాకుండా ఈ డ్రగ్స్‌తో రకరకాలుగా ఉపయోగాలున్నాయట. కొన్ని డ్రగ్స్ వాడితే మొహం తేజోవంతంగా ఉంటుంది. హుషారుగా ఉంటుంది. ముఖ్యంగా ఫైట్స్, డాన్స్ చేసేటప్పుడు కొంతమంది నటులు వీటిని ఉపయోగిస్తారని తెలిసింది. మొన్నీమధ్య పట్టుబడ్డ నైజీరియా దేశస్థుడు డ్రగ్స్ ఉపయోగాలు చెబుతూ... ఎక్కువ ఎనర్జీతో 24గంటలు హుషారుగా ఉంటారనీ, సెక్స్‌లో కూడా ఎక్కువసేపు పాల్గొంటారనే రహస్యాన్ని వెల్లడించాడు. ఇక రాజకీయ నాయకులుకూడా కొందరు వాడతారని నిజాన్ని చెప్పాడు. కానీ అవి బయటకు రాకుండా పోలీసులు జాగ్రత్తపడ్డారట.
No comments:
Post a Comment